Thursday, 4 January 2024

శ్రీ గరుడ పురాణము (53)

 


ఆవాహన తరువాత


ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్ర కిరణాయ గచ్ఛసుఖం పునరాగమనాయ అనే మంత్రాలతో విసర్జనం చేయాలి".

హరి ఇంకా ఇలా చెప్పాడు, “రుద్ర దేవా! సూర్య పూజన విధానాన్ని ఒకప్పుడు కుబేరునికి చెప్పాను. ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను.


సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడై ఒక పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన అష్టదళకమలాన్ని నిర్మించాలి. అపుడు సూర్యదేవుని ఆవాహనం చేయాలి. తరువాత భూమిపై నిర్మితమైన కమలదళాల మధ్యలో ఖఖోల్కభగవానుడైన సూర్యయంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి.


ఆ తరువాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైవ హృదయాన్ని స్థాపించాలి. ఈశాన్యంలో శిరస్సునీ, నైరృత్యంలో శిఖనీ విన్యాసం చెయ్యాలి (అంటే పెట్టాలి). మరల ఏకాగ్రచిత్తంతో తూర్పు వైపు ధర్మాన్నీ, వాయవ్యంలో నేత్రాలనూ, పశ్చిమ దిశలో తన ఇష్టదైవం యొక్క అస్త్రాలనూ వుంచాలి.


మరల ఈశాన్యంలో చంద్రునీ, తూర్పున మంగళునీ, ఆగ్నేయంలో బుధునీ, దక్షిణ దిశలో బృహస్పతినీ, నైరృతిలో శుక్రునీ, పడమటి దెసలో శనినీ, వ్యాయవ్యంలో కేతువునీ, ఉత్తర దిక్కులో రాహువునీ స్థాపించి పూజించాలి.


ద్వాదశాదిత్యులను అనగా భగ, సూర్య, అర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాతా, వివస్వాన్, త్వష్ట, పూష, ఇంద్ర, విష్ణు- అను సూర్యుని పన్నెండు రూపాలనూ రెండవ వరుసలో పెట్టి పూజించాలి.


తరువాత పూర్వాది దిశలలో నున్న ఇంద్రాదులను అర్చించి, జయా, విజయా, జయంతి, అపరాజిత అను శక్తులనూ వాసుకి, శేషాదినాగులనూ కూడా పూజించాలి. ఇది సూర్య పూజావిధానం.”


(అధ్యాయాలు - 16,17)


No comments:

Post a Comment