Thursday, 11 January 2024

శ్రీ గరుడ పురాణము (59)

 


'ఓం హ్రాం సదాశివాయనమః అనే మంత్రాన్ని జపిస్తూ చూపుడు వేలు, చిటికెన వేలు వాడుతూ అనార్ పుష్పం వలె కాంతులు వెదజల్లు ఒక పిండమును నిర్మించాలి. దానిని చూడగానే దుష్టజనులు, దుష్టమేఘాలు, విషాలు, రాక్షసులు, డాకిన్యాదులు భయపడి పారిపోతాయి.


'ఓం హ్రీం గణేశాయ నమః ।

ఓం హ్రీం స్తంభనాది చక్రాయ నమః ।

ఓం ఐం బ్రాహ్మ్యై త్రైలోక్య డామరాయ నమః |


(డామరాయ)


- ఈ మంత్ర సంగ్రహాన్ని 'భైరవ పిండ' మంటారు. ఇది విషాన్నీ, పాపిష్టి గ్రహాల దుష్ట ప్రభావాన్నీ సమాప్తం చేయడంలో కడు సమర్థము. ఇది సాధకుని కార్యక్షేత్ర రక్షణనీ, భూత-రాక్షసాది గణాల ఉపద్రశక్తుల నుండి రక్షణనీ కల్పించగలదు.


'ఓం నమః' అంటూ సాధకుడు తన చేతిలోనే ఇంద్ర వజ్రాయుధాన్ని భావించుకొని 

ధ్యానం చేయడాన్ని 'వజ్రముద్ర' అంటారు. ఇది విష, శత్రు, భూతగణాలను నశింపజేయగలదు. 'ఓం క్షుం (లేదా క్ష) నమః' అనే మంత్రాన్ని జపిస్తూ ఎడమ చేతిలో పాశాన్ని భావించుకొని స్మరణ చేసినా అదే ఫలముంటుంది. ఓం హ్రాం (లేదా హోం) నమః అనే మంత్రోచ్ఛాటన వల్ల ఉపద్రవకారకులైన మేఘ, పాప గ్రహాల ప్రభావం నశిస్తుంది. ఓం క్ష (క్ష్మ) నమః అనే మంత్రంతో కాలభైరవుని ధ్యానిస్తే కూడా అదే ఫలితముంటుంది.


'ఓం లసద్ ద్విజిహ్వాక్ష స్వాహా' అనే మంత్రాన్నుచ్చరిస్తూ దైవ ధ్యానం చేయడం వల్ల పంట పొలాలు గ్రహ, భూత, విష, పక్షి పీడల నుండి రక్షింపబడతాయి.


ఓం క్ష్వ (క్ణం) నమః అనే మంత్రాన్ని నగారాపై ఎఱ్ఱని సిరాతో రాసి చదువుతూ కర్రతో కొడితే ఆ శబ్దాలను వినగానే పాప గ్రహాది ఉపద్రవకారక తత్త్వాలన్నీ భయభీతాలై పారిపోతాయి. 


(అధ్యాయాలు 19, 20)


No comments:

Post a Comment