Monday, 15 January 2024

శ్రీ గరుడ పురాణము (63)

 


తరువాత దండీ, పింగళాది భూత నాయకులను ఓం దండినే నమః, ఓం పింగలాయ నమః మున్నగు మంత్రాల ద్వారానూ, అనంతరం ఆగ్నేయాది కోణాలలో ఓం విమలాయై నమః, ఓం ఈశానాయై నమః అంటూ శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారానూ స్థాపించి, స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలూ ప్రాప్తిస్తాయి.


మహాశక్తులను బీజమంత్ర యుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి.


ఓం రాం పద్మాయై నమః   ఆగ్నేయం

ఓం రీం దీప్తాయై నమః   నైరృత్యం

ఓం రూం సూక్ష్మాయై నమః  వాయవ్యం

ఓం రేం జయాయై నమః   ఈశాన్యం

ఓం రైం భద్రాయై నమః   తూర్పు

ఓం రోం విభూత్యై నమః   దక్షిణం

ఓం రౌం విమలాయై నమః    పశ్చిమం

ఓం రం అమోఘికాయై నమః   ఉత్తరం

ఓం రం విద్యుతాయై నమః   ఉత్తరం

ఓం రం సర్వతోముఖ్యై నమః   మండలమధ్యం


తరువాత శివస్వరూపమున్న సూర్య ప్రతిమను సూర్యాసనంపై స్థాపించి హ్రాం హ్రూం (లేదా హ్రీం)సః అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి క్రింది మంత్రాలతో న్యాసం చేయాలి.


'ఓం ఆం హృదర్కాయ నమః '

'ఓం భూర్భువః స్వః శిరసే స్వాహా'

'ఓం భూర్భువః స్వః శిఖాయై వౌషట్'

'ఓం హ్రం జ్వాలిన్యై నమః '

'ఓం హ్రుం కవచాయ హుం'

'ఓం హ్రూం అస్త్రాయ ఫట్'

'ఓం హ్రం ఫట్ రాజ్ఞ్యై నమః '

'ఓం హ్రం ఫట్ దీక్షితాయై నమః '


No comments:

Post a Comment