తరువాత దిక్పాలకులనూ, వారి మధ్యలో చండేశ్వరీ దేవిని పూజించాలి.
చివర మరల శివుని ఇలా స్తుతించాలి. క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి.
గుహ్యాతిగుహ్యగోప్తాత్వం
గృహాణా స్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మేదేవ త్వత్ప్రసాదాత్ త్వయి స్థితిః ||
యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం |
తన్మే శివ పదస్థస్య రుద్ర క్షపయ శంకరః ॥
శివోదాతా శివోభోక్తా శివః సర్వమిదంజగత్ |
శివోజయతి సర్వత్రయః శివః సోఽహమేవచ ॥
యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం సుకృతం తవ |
త్వం త్రాతా విశ్వనేతాచనాన్యో నాథోస్తి మే శివ ॥ (ఆచార కాండం 23/26-29)
'హే ప్రభో! నీవు గుహ్యాతిగుహ్యమైన తత్త్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు. నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి. నీ కృపవల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతంగా వుండేలా వరమియ్యి. రుద్రదేవా! శంకరా! నా పాపాలను నశింపజెయ్యి. పుణ్యాన్ని కూడా హరింపజేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో. భక్తులకు సర్వస్వాన్నీ వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు. సర్వభర్తవు. నా భవిష్యత్కర్మలన్నీ నీ వైపే పయనించే లాగ నన్ను దీవించు. రక్షకుడవు నీవే. విశ్వనాయకుడవు నీవే. హే పరమశివా! నాకు వేరే దిక్కు గాని దైవంగాని లేదు' అని ఈ స్తుతి సారము.
ఈ రకంగా శివోపాసనచేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాతపడడు. అతి శోతోష్టాలకూ అతీతుడవుతాడు.
భగవానుడైన సదాశివుని మంగళమయధ్యాన స్వరూపాన్ని (అనుబంధం-3లో చూడండి.)
No comments:
Post a Comment