పంటపొలాలు, చెట్లకు పట్టే పురుగులని తిని జీవిస్తాయి పిచ్చుకలు. పిచ్చుక చూడడానికి చిన్న ప్రాణియే అయినా, జీవవైవిధ్యంలో తన వంతు పాత్రను పోషిస్తోంది. పిచ్చుకలు అంతరించిపోతే ఏమవుతుంది అన్న ప్రశ్నకు చరిత్ర సమాధానం చెప్తున్నది. ఒకప్పుడు చైనాలో పిచ్చుకలంటె చీడ పురుగులుగా భావించేవారు, అది చిన్న ప్రాణి, అల్పమైనది, బలహీనమైనది, అది పంటలను నాశనం చేస్తుంది, ఆహార ధాన్యాలను అధికంగా తినేస్తోందన్న అపోహతో చైనాలో పిచ్చుకల జాతిని నాశనం చేయండన్న ప్రచారం ఊపందుకున్నది. ఫలితంగా అతి తక్కువ సమయంలో పిచ్చుకలు మొత్తం నశించాయి. పిచ్చుకల ఆహారం పంటపొలాలపై దాడి చేసే పురుగులు. పిచ్చుకలు లేని కారణంగా పంటలకు మరింతగా పురుగుపట్టి 1958-61 మధ్య చైనా తీవ్రమైన ఆహారకొరతను ఎదురుకొంది, కరువు సంభవించింది, ప్రజలు ఆకలితో మాడి ప్రాణాలు విడిచారు. ఈ వార్తను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టింది. చిన్ని పిచ్చుకే .............లేకపోతే ఏమవుతుందిలే అనుకున్నారు, జనం ప్రాణం పోతే కానీ తెలియలేదు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరుగుతోంది. భారత్‌లో మారిన జీవశైలి, వ్యవసాయంలో రసాయనిక మందులు వాడడం, బి.టి. విత్తనాలు పిచ్చుకలు గూడు కట్టుకోవడానికి వీలు లేకుండా నిట్టనిలువునా అట్టపెట్టాలా కట్టేస్తున్న పెద్ద పెద్ద భవనాలు పిచ్చుకల జాతికి మరాణశాసనంలా మారాయి. పిచ్చుకలు ఉనికి ప్రమాదంలో పడటానికి కారణం సెల్ టవర్లని మొదట్లో భావించినా, మారిన మానవ జీవినశైలి, ఆధునిక గృహనిర్మాణశైలి ప్రధాన కారణాలని తర్వాత గ్రహించారు. పిచ్చుకలు అంతరించిపోవడం పెనుప్రమాదానికి సంకేతం. పిచ్చుకలు అంతరించిపోతే ప్రపంచ ఆకలితో అలమటించాల్సి వస్తుంది.
ఒకప్పుడు మన పెద్దలు ఇంటి ముందు కాసిన్ని పప్పులు, జొన్నలు, సజ్జలు, రాగులు లేక ఇతర ధాన్యపు గింజలను ఒక పళ్ళెంలో పెట్టి, ఒక మట్టి ముంతలో పక్షుల కోసం నీరు పెట్టేవారు. కానీ మనకు అంత ఆలోచన లేదు, విశాల భావాలు అంతకంటే లేవు, ఎందూకంటే మనం ఆధునికులం కదా. ఉరుకులుపరుగుల జీవితం తప్ప, మన తోటిజీవాల గురించి ఆలోచన లేదు. అందుకే మనం వాటికి ఆహరం, నీరు పెట్టే అలవాటును మానుకున్నాం. అవి కూడా పిచ్చుకలు అంతరించిపోవడానికి ఒక కారణం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పిచ్చుకల జాతి అంతరించిపోకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహన రావాలనీ, మార్చి 20ని ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా ప్రకటించారు.
పిచ్చుకలను కాపాడడానికి మనవంతుగా వాటికి గూటిని, కాసింత ఆహారాన్ని, పరిశుభ్రమైన నీటిని అందిద్దాం. పిచ్చుకలను మన పిల్లకు పుస్తకాల్లో కాకుండా ప్రత్యక్షంగా చూసేలా అవకాశం ఇద్దాం.
గ్రీన్ క్లైమేట్ : పచ్చని వాతవరణం మాసపత్రికలో 2013 పిచ్చుకల గురించి ప్రచురితమైన కధనం మీ కోసం, క్రింద చదవండి.
అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జీవజాతులలో తాను చేరిపోయానంటూ కన్నీరుపెట్టుకుంటోంది మన చిన్ననాటి నేస్తం, మన బాల్యపు జ్ఞాపకం, మనల్ని నమ్ముకున్న చిన్న ప్రాణి మన ఇంటి పిచ్చుక.
ఒకప్పుడు మన ఇళ్ళచూరలు పట్టుకుని కిచకిచలాడుతూ వేలాడుతూ మనతో పాటే ఉండేది....
పల్లెగ్రామాల్లో రైతుల ముంగిళ్ళలో వేలాడె ధాన్యపుకంకుల గుచ్ఛాలపై పువ్వులా మెరిసేది........
నేడు పూరిళ్ళు, లోగిళ్ళూ కాస్తా సిమ్మెంటు గూళ్ళైపోయాయి.......
చిన్న పిచ్చుక బ్రతకడానికి గూడు లేకుండా చేసాయి.
పోలాల్లో చల్లే రసాయనక్రిమిసంహారక మందులు పిచ్చుకలను వాటి తిండికి దూరం చేసాయి
పట్టణాలలోనూ ఇంటి పిచ్చుక జీవితం ఒక ప్రశ్నగా మారింది......
ఇక్కడా వాటిని రసాయనక్రిమిసంహారకాలు వదలలేదు
ఆకాశహర్మ్యాలెన్నో పట్టణాలలో కట్టినా ఇంటి పిచ్చుకలకు ఆ ఇంటి కాసింత చోటు లేకుండా పోయింది
అక్కడితో ఆగలేదు........? సెల్ టవర్ ల రేడియోధార్మికత పిచ్చుకలకు కడుపుకోత తెచ్చిపెట్టింది.............
నేడి ఇంటి పిచ్చుక జీవనం ప్రమాదంలో పడింది........ ఆ చిన్నపొట్టకు తినేనుందుకు ఇంత తిండి దొరకడం లేదు........
ఎండావానల్లో తడవకుండా అయిదున్నర అంగుళాల మేర గూడుకట్టుకోవడానికి మనింట దానికి రవ్వంత చోటు లేదు
అంతరించిపోతున్న ఈ చిన్నారి ఇంటిపిచ్చుక జాతిని రక్షించాలంటే మనందరి తక్షణ కర్తవ్యం ఏమిటి?.............
జరిగిపోయిన తప్పిదాలను మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఆ పిచ్చుకల జాతిని కాపాడుకోవాలి ఇంటింటా దానికో గూడుకట్టి. పిడికెడు గింజలు చల్లి, కాసిన్ని నీళ్ళు పెట్టి మన ఇంటి పిచ్చుకలను బతికిద్దాం..........
పర్యావరణ పరిరక్షణలో, జీవవైవిధ్య సంరక్షణలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం............
మన ఇంటి పిచ్చుకలను మనమే పరిరక్షించుకుందాం
మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినం.
ప్రకృతిలోని అన్ని జీవాలు చల్లగా ఉంటేనే మానవ మనుగడ సాధ్యం. ఈ రోజు నుంచే పిచ్చుకల కోసం నీరు, ఆహారం పెడదాం. మన ఇంటితో పాటు హృదయంలో కూడా కాసింత చోటిద్దాం.

No comments:
Post a Comment