Monday, 16 March 2015

విద్యుత్‌ను పొదుపుగా వాడుకుందాం

విద్యుత్ లేని జీవితాన్ని ఊహించలేమని తరుచూ చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ అదే విద్యుత్ వాడకం, విద్యుత్ ఉపకరణాలు కర్బన ఉద్గారాలను పెంచి, భూతాపాన్ని కలిగిస్తున్నాయి. అందుకే తరుచూ విద్యుత్‌ను పొదుపుగా వాడండి అనే ప్రచారాన్ని చూస్తుంటాం. వెంటనే మనకు అనిపిస్తుంది 'నేను వాడుతున్న దానికి డబ్బులు కడుతునప్పుడు ఎంత వాడుకుంటే ఏంటి? ' అని ప్రశ్నిస్తారు. పొదుపు చేయమంటే మేము కరెంటు వాడద్దు అంటున్నారు? మీరు వాడటం లేదా? లైట్లు, ఫ్యాన్లు వాడుకోవటం లేదా? అన్నీ మానేసి కూర్చోమంటారా? అంటూ మూర్ఖంగా వాదించే వారిని కూడా నేను చూశాను. ఒక వస్తువును ఉపయోగించడానికి, దుర్వినియోగం చేయటానికి మధ్య బేధం తెలియని వారికి ఎలా చెప్పాలో అర్దం కానీ పరిస్థితి. అసలు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవడం ఎందుకు? దాని వల్ల ఇతరులకు ఉపయోగమేమిటి? దేశానికి మనం చేసే మేలు ఏమిటి? ఈ విషయంపై ఈనాడు పేపర్‌లో 2013 లో వచ్చిన కధనం చూడండి.



'కాసేపు కరెంటు లేకపోతే ఉక్కిరిబిక్కిరైపోతున్నామే, మరి గ్రామాల్లో మన సోదరులు, మనకు అన్నం పెట్టే రైతులు గంటలుగంటలు కరెంటు లేకుండా ఎలా ఉండగలరు?

విద్యుత్ సంక్షోభం నేపధ్యంలో రాష్ట్ర ఇంధన వనరుల విభాగం పాఠశాల్లలో విద్యుత్‌పొదుపు పై ప్రచారం చేపట్టింది.జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో, భారతీయ విద్యాభవన్, ఓబుల్ రెడ్డి స్కూల్ విద్యార్ధులు కలిసి 2 నెలల్లో దాదాపు 60వేల యూనిట్లు పొసుపు చేశారు. వీటితో మూడు చిన్న గ్రామాలకు నెల రోజుల పాటు విద్యుత్ అందించవచ్చని ఏపీసీపీడీసీయల్ అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే ఆదా చేసిన దాంతో పల్లెలకు ప్రస్తుతం ఇచ్చే దానికంటె మెరుగైన సర్ఫరా చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ ఇలా చేస్తే ఏటా రూ.7 వేల కోట్లు విలువ చేసే 1500 కోట్ల యూనిట్లు పొదుపు చేయచ్చని రాష్ట్ర ఇంధనవనరుల సంరక్షణ పధకం, సీఈఓ, చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.

వాడకం పెరిగితే డిమాండు పెరుగుతుంది. సర్ఫరాకు డిమాండుకు మధ్య అంతరం పెరిగి లోటు ఏర్పడుతుంది. ఫలితంగా కోతలు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి ఆలోచించండి'.

విద్యుత్‌ను పొదుపు చేయడం వలన ప్రభుత్వాలు అధికంగా బొగ్గు కొని ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా కాలుష్యం తగ్గుతుంది, దేశసంపద కూడా ఆదా అవుతుంది. దేశభక్తి అంటే దేశం గురించి నాలుగు ప్రసంగాలు చేయటం కాదు, దేశం యొక్క వనరులను రక్షించుకోవటం, సంపదను కాపాడటం.   

మనం పొదుపు చేసే విద్యుత్ (ఒక్క యూనిట్ అయినా సరే) మరొకరికి ఉపయోగపడవచ్చు. ఆ పాఠశాల విద్యార్ధులను మనం ఆదర్శంగా తీసుకుందాం. విద్యుత్‌ను పొదుపుగా వాడుకుందాం.

విద్యుత్‌ను పొదుపు చేసే మార్గాలు కోసం ఈ లింక్ చూడండి. http://ecoganesha.blogspot.in/2013/05/save-energy-save-earth.html

మన సనాతనధర్మంలో వనరుల వినియోగం, దుర్వినియోగం గురించి ఏం చెప్పబడింది? మన ధర్మం ఏంటి? ............ ఈ లింక్ లో చూడండి. http://ecoganesha.blogspot.in/2014/03/36-3.html
జై హింద్ 

Originally Published: 28-April-2013 
1st Edit: 16-March-2015

No comments:

Post a Comment