Saturday, 28 March 2015

రామాయణం మన రక్తంలో ఉంది.

రామాయణం మన రక్తంలో ఉంది.

రాముడు మనలాంటి మాములు మనిషే. రామాయణంలో రాముడు ఎక్కడా మహిమలు చూపలేదు. ఒక మాములు వ్యక్తిగా పుట్టిన వ్యక్తి దాదాపు 10,00,000 నుంచి 18,00,000 సమవత్సరాలు గడిచిపోయినా, ఇంకా అదే వైభవంతో వెలగడానికి కారణం రాముడి సత్యనిష్ట, ధర్మ నిబద్ధత.

రాముడు తన బాణాలతో 18,000 మంది కరదూషణాదులను చంపాడు కానీ తనకు అమోఘమైన శక్తి ఉన్నదని గర్వించలేదు. వాలి ప్రపంచంలో ఉన్న వానరసైన్యాన్ని ఏక తాటిపైకి తీసుకువచ్చి, సమన్వయ పరిచాడు. వాలి ఎంత శక్తివంతుడంటే, వాలికి రావణాసురుడు కూడా భయపడ్డాడు. అటువంటి వాలితో స్నేహం చేస్తే, సీతమ్మను క్షణంలో లంక నుంచి తీసుకురావచ్చని తెలిసినా, వాలి తన ధర్మం తప్పాడని అతని సాయం కోరలేదు. వాలిని చూసి భయపడుతున్న సుగ్రీవునికి అండగా నిలబడ్డడు. వాలిని చంపి, రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పజెప్పాడు కానీ తాను రాజ్యంలో కొద్ది భాగం కూడా తీసుకోలేదు.

శత్రువు తమ్ముడైనా, తనను శరణు వేడుకున్నాడని విభీషణుడికి గౌరవం ఇచ్చాడు, స్నేహం కుదిరిని వెంటనే విభీషణునికి లంకాధిపతిగా సముద్రజలాలతో పట్టాభిషేకం చేశాడు శ్రీ రాముడు. అప్పుడు అక్కడున్న వారికి ఒక ప్రశ్న తలెత్తింది. విభీషణుడు శరణుజొచ్చాడని అతనికి పట్టాభిషేకం చేశావు, మరి రేపు రావణుడు శరణు వేడితే ఏం చేస్తావు రామా?! అని అడిగారు అక్కడున్న వారు. నేను ఆడినమాట తప్పను, అదే జరిగితే, విభీషణుడిని అయోధ్యకు రాజును చేస్తాను అన్నాడు. ఇంత ధైర్యంగా ఈ మాటను ఎవరు చెప్పగలరు ఒక్క మన రాముడు తప్ప!

రామరావణ యుద్ధం అప్పట్లో ఒక ప్రపంచ యుద్ధంగా చెప్పచ్చు. రావణుడు సమస్తప్రపంచాన్ని హడలుగొట్టిన వీరుడు. అటువంటి రావణుడితో యువకుడైన రాముడు  పోరాటం చేయడానికి పూనుకోవడం, అది కూడా వైరంతో కాదు, తన భార్య కోసం ............... ఒక చారిత్రాత్మిక సంఘటన. రాముడు అందగాడు, రాకుమారుడు, ఆజానుబాహుడు, తను కోరుకుంటే ప్రపంచంలో ఉన్నా సుందరీమణులందరూ రాముడిని వివాహం చేసుకోవాడానికి సిద్ధపడతారు. అయినా, కట్టుకున్న భార్యను కాపాడటం భర్త విధి. ధర్మార్ధకామాలలో నేను నీ చేయి విడిచి పెట్టను అని వివాహసమయంలో చేసిన ప్రమాణాన్ని గట్టిగా పాటించి, లోకానీకి మార్గం చూపినవాడు శ్రీ రాముడు.

తన భార్య కోసం రావణుడితో భీకరయుద్ధానికి సిద్ధమయ్యాడు. అది మాములు యుద్ధం కాదు, అందులో అణ్వస్త్రాలు (న్యూక్లియర్ వెపన్లు), మిస్సైల్స్, రాడర్లకు అంతుచిక్కని విధంగా తయారు చేయబడిన యుద్ధ విమానాలు మొదలైనవి రావణుడి చెంత ఉన్నా, వాటికి బెదరలేదు శ్రీరాముడు. ఎదురించి, యుద్ధం చేసి గెలిచాడు, రావణుడి చెంత బంధీలుగా ఉన్నా ఎందరో స్త్రీలను విడిపించాడు, సీతమ్మను గ్రహించాడు. ఇంత చేసినా, లంక నుంచి రూపాయి తీసుకోలేదు, రాజ్యంలో వాటా అడగలేదు. లంకలో ధర్మస్థాపన చేసి, విభీషణుడిని లంకాధిపతిని చేశాడు.

అప్పటికి రాముడికి రాజ్యం మీద ఆసక్తిలేదు. భరతుడి మనసు మారిందేమో, భరతుడు రాజ్యపరిపాలన చేయాలనుకుంటున్నాడేమో, ఒక వేల అదే నిజమైతే, తాను తన జీవితాన్ని అడవిలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ పరిస్థితి చూసి రమ్మని హనుమను పంపారు, భరతుడు రాముడి రాక ఆలస్యమైందని ఆత్మాహుతికి సిద్ధం అవుతున్నాడని తెలుసుకుని, తన తమ్ముడి ప్రాణం కోసమే రాముడు అయోధ్య చేరాడు.

ఒక్కసరి చరిత్ర గమనిస్తే మన దేశం మీద ఎందరో దాడి చేశారు, సంపదను దోపిడి చేశారు, సంస్కృతిని నాశనం చేశారు, చరిత్ర మొత్తం క్రైస్తవ, మహమ్మదీయ అకృత్యాలే కనిపిస్తాయి. కానీ చరిత్రలో ఎప్పుడైనా హిందుస్థాన్(భారత్) ఏ దేశం మీదనైనా దందయాత్ర చేసిందా? ఏ దేశసంపదనైనా దోచుకుందా? రాముడి డి.ఎన్.ఏ మనది. అందుకే దోచుకోవడం, దోపిడి చేయడం, దండయాత్ర చేయడం మన హిందూ చరిత్రలో లేదు. ఇతర దేశాల్లో వారి ధర్మస్థాపన కోసం కలగజేసుకోవాలి. వారి దేశసంస్కృతిని మనం కాపాడాలి, అది నేపాల్ అయినా, టిబెట్ అయినా, లేక మరే ఇతరదేశమైనా. అంతవరకే మన కర్తవ్యం. అదే మనకు రాముడు నేర్పాడు. రాముడు, రామాయణం మన రక్తంలో ఉన్నాయి.

Originally posted: 0-April-2014
1st Edit: 28-March-2015

4 comments:

  1. . . . రాముడు తన బాణాలతో 18,000 మంది కరదూషణాదులను చంపాడు . . .
    రామాయణం ప్రకారం 14,000 మందే నండీ.
    వనే‌తస్మిన్ నివసతా జనస్థాననివాసినమ్। రాక్షసామ్ నిహతాని అసన్ సహస్రాణి చతుర్దశా॥
    అని బాలరామాయణంలో‌కనిపిస్తున్నది కదా.

    . . . . రావణుడు శరణు వేడితే... విభీషణుని అయోధ్యకు రాజును చేస్తాను అన్నాడు. . . .
    రావణుడే‌ వచ్చి శరణువేడినా లంక విభీషణుడిదే, రావణుడికి అయోధ్యను ఇస్తానని రాముడన్నట్లు చెబుతారు. ఈ‌మాట ఇతర కవుల రామాయణాల్లో ఉందేమో. వాల్మీకి ఆమాట వ్రాయలేదండి.

    @అన్వేష్
    మీకు రామాయణం గురించి కనీస అవగాహన కూడా లేదని అనిపిస్తోంది. అన్నరాజ్యం‌ పైనో‌ అన్నభార్య పైనో విభీషణుడు కన్నువేశాడని సాక్ష్యంచెప్పే మాటలు వాల్మీకంలో ఎక్కడున్నాయో చూపించండి? లంకలో విభీషణుడిని రాముడు సైడ్ చేయటమేమిటీ - లంకలో విభీషణుడికి పట్టాభిషేకం నిర్వహించింది లక్ష్మణుడు - రాముడు లంకలో‌ కాలుపెట్టనే లేదు తన వనవాసదీక్షకారణంగా. కాదూ‌ రాముడు లంకానగరంలోనికి వెళ్ళాడంటారా - సాక్ష్యం చూపండి వాల్మీకి రామాయణంలో? విభీషణుడు ఆశపోతు అని మీరు వెక్కిరిస్తే సరిపోతుందా - వాల్మీకంలో అలా సూచించే మాట ఏమన్నా వాల్మీకి చెప్పాడా? మీరు ఇలా చిత్తంవచ్చినట్లు వ్రాయటం చాలా తప్పు.

    @బ్లాగరు మహాశయా:
    దయచేసి ఉచితమైన వ్యాఖ్యలను మాత్రమే ప్రచురించండి. ఎవరేది వ్రాసినా మహాప్రసాదం అనుకొని అచ్చువేయటం‌ కూడా నిస్సందేహంగా తప్పే. వ్యాఖ్యలకు కూడా బ్లాగరు బాధ్యతవహించవలసి ఉంటుంది. దానినుండి తప్పించుకోవటం‌ కుదరదు. మీరు నీచవ్యాఖ్య(ల)ను తొలగించటం ఉచితంగా ఉంటుంది. అపైన మీ‌యిష్టం.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా తొలగిస్తానండీ, ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నాను. మన సంస్కృతిని, దైవాన్ని దూషిస్తుంటే, ఒప్పుకునేది లేదు. మనం సరిగ్గా చెప్పినా వినరు. కనుక తొలగిస్తానండి.

      Delete
    2. ఆ అనుచిత వ్యాఖ్యను తొలగిస్తానన్నారు? ఇంకా మంచి ముహూర్తం కుదరలేదాండీ?

      Delete


  2. అదిగో యన్వేషుండు ద
    బదబయని కమింట్ల హోరు బదలా యించెన్
    వదనము మారిన నేమీ
    చెదలుగనిన బుద్ధి కోరు చెరుపుదలగదా !

    జిలేబి

    ReplyDelete