వేదార్దాన్ని వక్రీకరించినవారిలో ముఖ్యుడు మాక్స్ ముల్లర్. ఇతను జెర్మన్ దేశస్థుడు. నిజానికి ఇంగ్లాండ్‌లో సంస్కృత అభ్యాసం 16 వ శతాబ్దంలోనే మొదలైంది. కానీ భారతదేశంపై అధికారాన్ని బ్రిటన్ చేజిక్కించుకున్న తర్వాత భారతీయులలో చీలికలు తీసుకురావడానికి, సనాతన ధర్మాన్ని విఛ్ఛినం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. భారతీయులను తమకు బానిసలు చేసుకోవాలని పన్నాగం పన్నింది. అందులో ఒక పావు మాక్స్ ముల్లర్. ఇతడు హిందువుల మతమార్పిడే లక్ష్యంగా వేదానికి అర్దం రాసేలా బ్రిటన్ ఆదేశించింది.
ఒక సంస్కృతి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, ఆ సంస్కృతిలో జన్మించి, దాన్ని పాటిస్తున్నవారు, దాని లోతులను అర్దం చేసుకున్నవారు చెప్తే, అసలు సందేశం యధాతధంగా అందుతుంది. దీని గురించి రాజీవ్ మల్హోత్రా గారు Invading the sacred పుస్తకంలో చెప్పిన ఒక విషయం చెప్పుకోవాలి. ఒక సంస్కృతి గురించి, జీవన విధానం గురించి విశదీకరించి చెప్పడం నాలుగు రకాలుగా ఉంటుంది.
ఆ సంస్కృతికి చెందినవారు, అదే సంస్కృతికి చెందినవారితో చెప్పడం మొదటి విధానం. దీన్ని వారు Insider to Insider అన్నారు. Insider కి సంస్కృతి యొక్క మూలతత్త్వం, దాన్ని అర్దం చేసుకునే విధానం, దాని సందేశంపై పూర్తి అవగాహన ఉంటుంది. శ్రోత కూడా Insider కాబట్టి కాస్తకూస్తో అవగాహన ఉంటుంది.
రెండవ విధనం Insider to Outsider. ఈ విధానంలో సంస్కృతికి చెందిన అంతర్గతవ్యక్తి (Insider), దీనికి చెందని వ్యక్తి (outsider) కి దీని గురించి చెప్పడం. ఇందులో శ్రోతకు Insider యొక్క జీవిన విధానంపై ఏ మాత్రం అవగాహన ఉండదు. అతడికి ఏ విషయాన్ని ఏకవ్యాక్యంలో చెప్పలేరు. అందువలన విశదీకరించి చెప్పాలి.
Outsider to Insider మూడవ విధానం. ఇక్కడ సమూహంతో ఏ సంబంధంలేని వ్యక్తి, దాన్ని ఆచరించని వ్యక్తి, దాని గురించి అదే సమూహానికి/ జీవన విధానానికి చెందిన వ్యక్తులతో చెప్పడం. వారికి వారి సంస్కృతినే పరిచయం చేయడం.
నాల్గవ విధానం Outsider to Outsider. ఇందులో సమూహానికి చెందిన వ్యక్తులతో ఏ మాత్రం సంబంధం ఉండదు. Outsider తనకు అర్దమైనంతమేర, అవగాహన చేసుకున్నంతమేర అవతలి వ్యక్తికి చెప్తాడు.
ఇందులో మొదటి రెండు పద్ధతులు శ్రేష్టమైనవి. ఎందుకంటే ఒక సంస్కృతిలో పుట్టి పెరిగిన వ్యక్తికి, దానిపై సంపూర్ణ అవగాహన ఉండడమేకాక, దాని లోటుపాట్లు, లోతు కూడా తెలిసి ఉంటాయి. అయితే ఇక్కడ కూడా హిందూ ధర్మానికి, అన్యమతాలకు తేడా ఉంది. హిందూ ధర్మానికి సంబంధించి చెప్పుకుంటే, కేవలం ఈ ధర్మంలో పుట్టడం వలన దీనిపై అవగాహన రాదు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, వారికి మాత్రమే వ్యక్తిగత అనుభవాల ద్వారా దీని రహస్యాలు, గూఢార్ధాలు బోధపడతాయి. కాబట్టి ఈ ధర్మానికి సంబంధించినంతవరకు Insider అంటే కేవలం ఇందులో పుట్టినవాడు అనే కాదు, ఇతర ప్రభవాలకు లోనుకాకుండా, ఈ ధర్మాన్ని అర్దం చేసుకునేవాడు, దీన్ని పాటించేవాడు అని అర్దం చేసుకోవాలి.. అన్యమతాల్లో ఇలా ఉండదు. అక్కడ అంతర్గత సాధనలు చేసి సాక్షాత్కారం పొందే వీలు వాటిలో లేదు. అవి కల్పించలేదు.
మూడు, నాలుగు పద్ధతులు లోపాలతో కూడినవి. అందులో ప్రధానమైన అంశం Outsider యొక్క ఉద్ద్యేశం (intention). అతను ఈ ధర్మం మీద ఏ ఉద్ద్యేశంతో, దీని గురించి ప్రవచిస్తున్నాడనేది ముఖ్యం. అతడు ఎంతవరకు సాధన చేసి, ఉన్నతమైన దివ్యానుభూతులు, సాక్షాత్కారం పొందాడనే పెద్ద ప్రశ్న వస్తుంది.
To be continued .......................
No comments:
Post a Comment