Friday, 2 October 2015

స్వతంత్రమా? గోవధ నిషేధమా? గాంధీగారిని అడిగిన ఆంగ్లేయులు.

స్వతంత్ర పోరాటంతో పాటు గోవధ నిషేధ ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రంగా జరుగుతున్న సమయంలో గాంధీగారిని పిలిచి బ్రిటీష్ వారు అడిగారు. మీకు స్వాతంత్రం కావాలా? లేక గోవధ నిసేధం కావాలా? అని.... దానికి సమాధానంగా గాంధీగారు 'నాకు గోవధ నిషేధమే కావాలి. మీరు గోవధను నిషేదిస్తే, ఈ స్వతంత్ర పోరాటం ఇప్పుడే ఆపేస్తాను.గోవులను రక్షించుకుంటేనే భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది' అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు 147 వ గాంధీ జయంతి జరుపుకుంటున్నాం. కానీ ఇప్పటికి ఈ దేశంలో గోవధ నిషేధం జరగలేదు. ఎక్కడైనా ప్రభుత్వాలు గోవధ నిషేధం చేస్తే, దాన్ని ప్రజల ఆహారను స్వేఛ్చను హరిస్తున్నారు, మతాన్ని రుద్దుతున్నారని కుహన-లౌకిక వాదులు, అదే వర్గానికి చెందిన మీడీయా పెద్ద గోల చేస్తున్నారు. జంతువధ కాలుష్యానికి, భూతాపానికి పెద్ద కారణమని తెలిసి కూడా, పర్యావరణాన్ని రక్షించడంటూ పోరాటం చేసే ఏ పర్యావరణవేత్త కూడా గోవధ నిషేధాన్ని అమలు చేయమని అడగరెందుకో ???!!! గాంధీగారి సిద్ధాంతాన్ని కనీసం ప్రజలైన అర్దం చేసుకోవాలి. భారతీయ గోవులను, దేశీఆవులను రక్షించుకుని, వాటి సంతతిని పెంచి, మహాత్ముని ఆత్మకు శాంతి చేకూర్చాలి. కనీసం వచ్చే గాంధీ జయంతికైనా వారి కల సాకారం కావాలి. దేశంలో గోవధ నిషేధం జరగాలి. దేశిగోవులను రక్షించడానికి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించి, ప్రత్యేక అధికారాలతో కొత్త సంస్థలను ఏర్పాటు చేసి, గోవులను రక్షించాలి. జై హింద్

2 comments:

  1. మీ టపావల్ల గాంధీని మరీ అంత గౌరవించవలసిన అవసరంలేదని మరోసారు ఝుజువయ్యింది. అయినా మనదేశంలో గాడ్సేని గౌరవించేవారే అవసరం కొద్దీ గాంధీని నెత్తికెత్తుకుంటారు. మనకి మనుషులు, వారి తప్పనిసరి తద్దినాలూ (మజ్‌బూరీలూ) పట్టవు. కుహనా హిందువులకు మనుషులకంటే జంతువులే ప్రియమైనవి.

    హిందువు కానివాడు, RSS హిందూత్వను వ్యతిరేకించే ప్రతివాడు కుహనా లౌకికవాదే!

    ReplyDelete
  2. గాంధీ గారికి మనుషుల స్వాతంత్ర్యంకన్నా జంతువులే ముఖ్యమన్నమాట. తన మతవిశ్వాసాలే ముఖ్యమన్నమాట!!!

    ReplyDelete