Thursday 15 October 2015

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ - బతుకమ్మ పాట

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ
తంగేడు కాయొప్పునే గౌరమ్మ
తంగేడు చెట్టు కింద ఆట

సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ
గుడ్డలు రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ
గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మడి చెట్టు కింద ఆట

సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
రుద్రాక్ష పువ్వొప్పునే గౌరమ్మ
రుద్రాక్ష కాయొప్పునే గౌరమ్మ

రుద్రాక్ష చెట్టు కింద
ఆట సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
కాకర పువ్వొప్పునే గౌరమ్మ
కాకర కాయొప్పునే గౌరమ్మ
కాకర చెట్టు కింద ఆట

సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
చామంతి పువ్వొప్పునే గౌరమ్మ
చామంతి కాయొప్పునే గౌరమ్మ..

చామంతి చెట్టు కింద ఆట
సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ
గుడ్డలు రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఆ పూలు తెప్పించి పూజించి
గంధముల కడిగించి కుంకుమల జాడించి
నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ

నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ
నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ

చిత్తు చిత్తుల బొమ్మ
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
రాగి బిందె తీసుక రమణి నీళ్లకు పోతే ॥2॥

రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
వెండి బిందె తీసుక వెలది నీళ్లకు పోతే ॥2॥
వెంకటేషుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
బంగారు బిందె తీసుక బామ నీళ్లకు పోతే ॥2॥
భగవంతుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
పగిడి బిందె తీసుకు పడితి నీళ్లకు పోతే ॥2॥
పరమేశుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥

ముత్యాల బిందె తీసుక ముదిత నీళ్లకు పోతే ॥2॥
ముద్దు కృష్ణుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥

కలవారి కోడలు ఉయ్యాలో
కలవారి కోడలు ఉయ్యాలో
కనక మహాలక్ష్మి ఉయ్యాలో
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో
కడవళ్లోన పోసి ఉయ్యాలో
అప్పుడే వచ్చేను ఉయ్యాలో

ఆమె పెద్దన్న ఉయ్యాలో
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో
కన్నీళ్లు దీసి ఉయ్యాలో
ఎందుకు సెల్లెలా ఉయ్యాలో
ఏమి కష్టాలమ్మా ఉయ్యాలో

తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో
ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డాను ఉయ్యాలో
వెళ్లి వద్దాము ఉయ్యాలో
చేరిమి వారితో ఉయ్యాలో
చెప్పిరా పోవమ్మా ఉయ్యాలో

పట్టె మంచం మీద ఉయ్యాలో
పవళించినామా ఉయ్యాలో
మాయన్నల వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అత్తను అడుగు ఉయ్యాలో

అరుగుల్ల కూసున్న ఉయ్యాలో
ఓ అత్తగారు ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ బావను అడుగు ఉయ్యాలో

భారతం చదివేటి ఉయ్యాలో
బావ పెద్ద బావ ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అక్కను అడుగు ఉయ్యాలో

వంటశాలలో ఉన్న ఉయ్యాలో
ఓ అక్క గారూ ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
నీ భర్తనే అడుగు ఉయ్యాలో

రచ్చలో కూర్చున్న ఉయ్యాలో
రాజేంద్రబోగి ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
కట్టుకో చీరలు ఉయ్యాలో
పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో

ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో
వెళ్లి రా ఊరికి ఉయ్యాలో
పుట్టినింటికి నీవు ఉయ్యాలో
శుభముగా పోయిరా ఉయ్యాలో
మెట్టినింటికి నీవు ఉయ్యాలో
క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో
మెట్టినింటికి నీవు ఉయ్యాలో
క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో.

http://goo.gl/RD49mM

No comments:

Post a Comment