రాహువు ఎంతో
వేగంతో సూర్యుని వైపు పరుగిడెతున్నాడు. అతనిని చూసిన వెంటనే హనుమానునకు ఆకలి గుర్తుకువచ్చింది.
అతడు రాహువును సుందరమైన భక్ష్యముగా భావించి అతనిపై బడ్డాను.
‘సురేశ్వరా!
రక్షించు రక్షించూ అని అరుస్తూ రాహువు ఇంద్రుని దగ్గరకు పరుగెత్తాడు.
సురాధిపతి రాహువును
రక్షించుటకు పరిగెత్తాడు. రాహువు తప్పించుకొనిపోయిన తర్వాత హనుమంతుడు ఐరావతాన్ని చూశాడు.
మధురఫలముగా భావించి దాని పైకి దూకాడు. అపుడు హనుమానుని స్వరూపము ప్రజ్వలించు అగ్నివలె
ప్రకాశిస్తూ భయంకరంగా ఉంది. ఇంద్రుడు భయపడ్డాడు, తనను కాపాడుకొనుటకు వజ్రాయుధాన్ని
ప్రయోగించాడు. అది హనుమానుని ఎడమ దవడకు తగిలింది, దవడ విరిగింది. వెంటనే అతడు గిలగిల
తన్నుకొనుచు పర్వతశిఖరము పైబడి మూర్ఛితుడయ్యాడు.
అట్లా తన ప్రియపుత్రుడు
వజ్రాఘాతముతో గిలగిల తన్నుకొంటూ క్రిందపడుట చూసిన వాయు దేవుడు ఇంద్రునిపై కోపగించాడు.
శక్తిశాలి యైన వాయు దేవుడు తన గతిని నిరోధించి, పుత్రుని తీసుకునొ పర్వతగుహలోనికి ప్రవేశించాడు.
త్రిలోకాలలో
ఉన్న సర్వప్రాణు లశ్వాసలు నిలచి పోయాయి. వారి అవయవముల సంధులు విడివడటం ఆరంభించాయి.
అందఱు ఎండిన కట్టెల వలె అవసన్నులయ్యారు. వారి సర్వధార్మిక కృత్యములు నిలచిపోయాయి.
ప్ర్రాణసంకటముతో
భయబడిన ఇంద్రుడు, దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు, గుహ్యకులు మొదలైఅన వారు ప్ర్రాణరక్షణకై
బ్రహ్మ దగగ్రకు పరుగెత్తారు. బ్రహ్మ అందరిని వెంట పెట్టుకుని పర్వతగుహలోనికి వెళ్ళాడు.
అక్కడ వాయు దేవుడు తన పుత్రుని ఒడిలో ఉన్చుకొని, హృదయానికి హత్తుకొని దుఃఖాతిరేకంతో
కన్నీటిని విడిస్తున్నాడు. మూర్ఛితుడైన హనుమానుని శరీరకాంతి సూర్యాగ్నుల వలెను, సువర్ణము
వలెను ఉండటం చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయారు.
No comments:
Post a Comment