Friday 9 December 2022

భేతాళ కథలు - 10



మహాసుకుమారి


విక్రమార్కా! జాగ్రత్తగా విను. మదనపురాన్ని పాలించే మీనకేతుడికి ముగ్గురు భార్యలుండేవారు. రాజుకి ఆ ముగ్గురియందూ సమాన ప్రేమే. ఒకనాడతను మంత్రితో - "నేనొకరోజు పెద్ద భార్య అయిన సౌందర్యవతితో పూలవసంలో విహరిస్తూంటే - ఒక చెట్టునుంచి పువ్వు రాలి ఆమె చేతిమీద పడింది. అంతే క్షణంలో ఆమె చెయ్యి ఎర్రగా కందిపోయింది.


మరొకసారి నేను నా రెండో భార్య శుభాంగితో మేడమీద విహరిస్తున్నాను. ఆ వేళ పున్నమి. వెన్నెల వచ్చింది. అంతే ఆమె పున్నమి వెన్నెలను సహించలేక మూర్ఛపోయింది.


ఇక - నా మూడో భార్య విలాసవతి విషయం విను. ఒకసారామె చిన్న పిల్లవాడి రోదన వింటూనే చెవులు దిబ్బళ్ళు వేసి - స్మారకం (స్పృహ) తప్పిపడిపోయింది” అన్నాడు. "రాజా! వీరు ముగ్గురిలోనూ అత్యంత సుకుమారి ఎవరు?" అడిగాడు భేతాళుడు. సౌందర్యవతి చేతి మీదపడిన పువ్వులో ఏ కీటకమో ఉండి కుట్టుటచే ఆమె చేయికంది ఉండ వచ్చును. నిండు వెన్నెలకు - యౌవనంలో ఉన్నవారికున్మాదం కలిగించే గుణం ఉంది. శుభాంగికి అటువంటి వ్యాధి ఉండి వెన్నెల వలన ప్రకోపించి ఉండవచ్చును. కాని... విలాసవతి శరీరమేకాక మనసుకూడా మహాసుకుమారమయినది కనుకనే బాలుడి రోదనకే ఆమె సొమ్మసిల్లిపోయింది. ఆమే మహాసుకుమారి." చెప్పాడు విక్రమార్కుడు.  


No comments:

Post a Comment