Saturday 10 December 2022

భేతాళ కథలు - 11

 


ఎవరు పెళ్లి చేసుకోవాలి?


స్వర్ణపురమనే మహానగరంలో నిగమశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతనికి సర్వాంగసుందరమయిన కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యానికి ముగ్ధులై మహారాజులు సైతం ఆమెను వివాహం చేసుకోదలచి వచ్చేవారు. కాని నిగమశర్మ - వారికి.


"అయ్యలారా! నా బిడ్డకు మేనమామలున్నారు. నేను భోగభాగ్యములకొరకు మేనరికమును వదలజాలను" అని వారిని పంపివేసేవాడు.


ఆమె మేనమామలు ముగ్గురూ ఒకేసారి వచ్చి - “మీ అమ్మాయిని నాకే యివ్వాలంటూ నిగమశర్మను కోరడమేకాక వారిలో వారక్కడే తగవులాడుకుని కొట్టుకొనుటకు సిద్ధపడిరి. అది గమనించిన గ్రామపెద్దలు -"యువకులారా! ఇటువంటి పరిస్థితిలో మీలో మీరెంత తగవులాడుకొన్ననూ ప్రయోజనముండదు. మీకు ఆరు నెలలు గడువిచ్చుచున్నాము. మీలో ఎవరయితే ప్రపంచంలోకెల్లా అతి విచిత్రమయిన వస్తువును తెస్తారో వారికే నిగమశర్మ కుమార్తెనిచ్చి వివాహము చేయుదుము" అని తీర్పు చెప్పారు. నిగమశర్మ కూడా అందుకంగీకరించాడు.


అన్నదమ్ములు ముగ్గురూ స్వర్ణపురంనుండి నూరామడల దూరమందున్న పట్టణము వరకూ కలసి ప్రయాణం చేశాక -"సోదరులారా! ఇకపై మన ముగ్గురమూ మూడు వైపులకి పోవుదము, తిరిగి యిక్కడికే వచ్చి కలుసుకొన్న తరవాత మామయ్య యింటికి వెళ్తాం..” అనుకుని ఒక్కొక్కరూ ఒక్కొక్క దిక్కుగా వెళ్లిపోయారు.


ఆరునెలలు పూర్తి కాబోయేటంతలో పెద్దవాడొక పేము బెత్తమునూ, రెండవవాడొక కీలుగుర్రాన్నీ, మూడవవాడొక అద్దము సంపాదించుకుని వచ్చి అక్కడ కలుసుకున్నారు.


చిన్నవాడు అద్దంలో చూచి - "సోదరులారా! మన శ్రమంతయూ బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమైపోయినది. మన మేనకోడలు మరణించినది. ఆమె శవమును స్మశానమునకు తీసుకుపోయి చితిపై ఉంచారు. కొన్ని నిమిషాలలో అగ్ని సంస్కారం జరుగగలదు" అన్నాడు. వెంటనే రెండవ వాడు కీలుగుర్రం మీద తన సోదరులిద్దరినీ ఎక్కించుకుని "ఓ అశ్వమా! మమ్ము తక్షణం మా మేనకోడలి శవమున్న స్మశానమునకు చేర్చుము." అన్నాడు. ఆ గుర్రం కన్ను మూసి తెరిచేంతలో వారిని చేరవలసిన చోటుకు చేర్చింది.


అప్పటికే శవమునకు అగ్నిసంస్కారం జరగడానికంతా సిద్ధంగా ఉంది. పెద్దవాడు చితిమీద ఉంచిన మేనకోడలి శవమును తన పేము బెత్తముతో మూడు దెబ్బలు కొట్టి "చిన్నదానా! లే." అని ముమ్మారన్నాడు. అంతే. ఆ సుందరి నిద్రలోంచి లేచినదానిలా చితిమీద లేచి కూర్చుంది.

No comments:

Post a Comment