Sunday, 11 December 2022

భేతాళ కథలు - 12



అప్పుడు మళ్లీ అన్నదమ్ముల్లో ఆమెకోసం తగవు మొదలయింది. “నేను అద్దంలో చూచి చెప్పడం బట్టికదా మీకు పరిస్థితి, ప్రమాదమూ తెలిశాయి. కనుక నేనే మేనకోడలిని పెళ్లి చేసుకుందుకు తగినవాడిని-" అని వాదించాడు చిన్నవాడు. "అద్దంలో చూచి చెప్పినా సకాలంలో యిక్కడికి చేరకపోతే ఏం ప్రయోజనం? సకాలంలో మిమ్మల్నిక్కడికి కీలుగుర్రంమీద చేర్చింది నేను. కనుక మేనకోడలిని వివాహమాడడానికి అర్హుడిని నేనే" అని నిర్ద్వంద్వంగా చెప్పాడు రెండోవాడు. "నేనిక్కడకి చేర్చకపోతే బెత్తంతో ఆమెకు ప్రాణం తెప్పించడం కూడా సాధ్యపడేది కాదు.”


"అద్దంలో చూసి చెప్పినా... కీలుగుర్రం మీద వచ్చినా... ఆమెకి ప్రాణదాత నా బెత్తమే. కనక - మేనకోడలిని పరిణయమాడడానికి యోగ్యుణ్ని నేనే" అన్నాడు పెద్దవాడు. రాజా! ఆ అన్నదమ్ములు ముగ్గురిలోనూ ఆమెను వివాహం చేసుకునేందుకు అర్హులెవరు?" ప్రశ్నించాడు భేతాళుడు.


"భేతాళా! వింత వస్తువులను తేవడంతో ముగ్గురన్నదమ్ములూ సమానమే. కాని మేనరికమునందు తగిన వరుడు పెద్దవాడు. కనుక ఆ సౌందర్యవతికి మేనమామలయిన ఆ ముగ్గురన్నదమ్ములలోనూ పెద్దవాడికే ఆమెను వివాహం చేసుకునే అర్హతుంది. అదే శాస్త్రం." అని చెప్పాడు విక్రమార్కుడు. దాంతో అతని మౌనం భంగపడింది. భేతాళుడా సమాధానానికి మెచ్చుకుంటూనే అంతర్ధానమయిపోయాడు. 

No comments:

Post a Comment