Saturday 17 December 2022

భేతాళ కథలు - 18



ఎవరితో కాపరం చెయ్యాలి?


విక్రమార్కా! పూర్వం ఒక కోటిశ్వరుడుండేవాడు. అతనిది విదేశాలతో వ్యాపారం. అందుచేత తరచుగా ఓడ ప్రయాణం చేస్తూ యితర ద్వీపాలకు వెళ్తూండేవాడు. ఆ రోజులలో ఓడ ప్రయాణమంటే ప్రమాదాలతో కూడుకున్నది. సముద్రం మీద దారి తప్పిపోవడం... తుఫానులకు ఓడలు పగిలి ప్రయాణికులు సముద్రంలో పడిపోయి మరణించడం.. దొంగల భయం... యిలాటివెన్నో జరిగేవి. అందుచేత - ఎటుపోయి ఎటు వస్తుందో అన్న భయంతో - అతను చాలా ప్రేమించే భార్యపేర కొంత ఆస్తిని దాన, విక్రయ (దానం చేయడానికి, అమ్మడానికీ) అధికారాలన్నిటి తోనూ రాసియిచ్చాడు. అంతేకాదు. నేను మూడు మాసములలో వస్తాను.” అని చెప్పి ప్రయాణమయ్యాడు. భర్త చెప్పిన గడువు దాటి ఆరుమాసాలయినా అతను తిరిగి రాకపోవడంతో అతని భార్యకీడు శంకించి మరొకరిని వివాహం చేసుకుంది. కొత్త భర్తతో ఆమె మూడు మాసాలు కాపరం చేశాక వ్యాపారి తిరిగివచ్చాడు. అతనికి భార్యంటే ప్రాణమే. ఆమెకీ అతనంటే ప్రేమే.


విక్రమారా! ఇప్పుడామె ఎవరితో కాపరం చేయాలి? ఎవరిని కాదనాలి?" అని ప్రశ్నించాడు భేతాళుడు. విక్రమార్కుడు ఆట్టే ఆలోచించకుండానే - "పునర్వివాహం జరగడంతోటే పూర్వవివాహం రద్దయిపోతుంది కనుక వ్యాపారికామె మీద హక్కుండదు, కాని - వారిద్దరికీ యిష్టమయినచో అమె వారిరువురితోనూ కాపరం చెయ్యవచ్చు" అన్నాడు. మౌనభంగంకావడంతో శవమూ దానిలోని భేతాళుడూ అదృశ్య మయ్యారు.

No comments:

Post a Comment