వరుసక్రమము - బంధుత్వము
విక్రమారా! పూర్వమొకగ్రామంలో ఒక రైతుండేవాడు. ఆతడు మిక్కిలి సహాయ స్వభావము కలవాడు. మంచివాడు. ఎవరికే ఆపద వచ్చిననూ ఆదుకొనేవాడు. కొన్ని కుటుంబములు వారాతని యింటియందు నివసించేవారు. ఆతనికొక్కడే కుమారుడు.
రైతొకనాడు పొలములో సేద్యము చేయుచు పనులు వత్తిడివలన మధ్యాహ్నం భోజనానికి రాజాలక పోయెను. పొలమునకే భోజనము పంపుడని తనవారినాదేశించెను. మధ్యాహ్న సమయానికి అత్తాకోడండ్రిద్దరూ ఆహారమును తీసుకొని పొలమునకు పోయారు. తండ్రి కొడుకులు పనియందు నిమగ్నులై వారి రాకను గమనించి కాళ్ళు కడిగికొని వచ్చి కూర్చొన్నారు. అత్తాకోడండ్రిద్దరూ ఎవరి తండ్రికి వారాహారము బెట్టి వెనుదిరిగారు. 'ఓ విక్రమార్క మహారాజా! వీరిద్దరూ తండ్రికొడుకులు. వారిద్దరూ అత్తాకోడండ్రు. వీరి బంధుత్వమెట్టిదియో యోచించి చెప్పుము'అని కోరాడు.
విక్రమార్కుడు చిఱునవ్వు నవ్వి "భేతాళా! ఆ రైతుకు కొడుకుకంటే పెద్దదైన కూతురు ఉంది. బావమరిదికే తన కూతురునిచ్చి పెండ్లి చేశారు. ఆ కూతురునకు పుట్టిన కూతురు అనగా మనుమరాలు తన కుమారునకు మేనకోడలు అవుతుంది. వారిద్దరికీ వివాహం జరుగుటచే ఆ మేనత్త కోడండ్రు రైతుకుమార్తెయు రైతు ముదిమనవరాండ్రు ఇరువురును అహారమునుగైకొని ఎవరి తండ్రికివారు అన్నము పెట్టుటలో ఔచిత్యమేమున్నది. ఈ విధముగా చెప్పినంతలో భేతాళుడు అంతర్థానమయ్యాడు.
No comments:
Post a Comment