సంపాతిద్వారా
సీతా దేవిజాడను వానర బృందము తెలుసుకుని మహదానందము పొందింది. తర్వాత కుతూహలము గలవారై
వారు సంపాతియొక్క జీవిత చరిత్ర పూర్తిగా తెసుకునిదలచి అడిగారు. అతడు వారికి ఎంతో ఆదరముతోనూ,
ప్రేమ తోనూ తని ఱెక్కలు భస్మమవ్వటం గురించి, చంద్రముని చెప్పిన సమస్త విషయములను గురించి
చెప్పాడు. అనంతరము అతడు ఇట్లా - "వానరులారా ! ఱెక్కలు లేని పక్షి యొక్క పరిస్థితిని
గురించి ఏమని చెప్పేది? ఈ దయనీయమైన స్థితిలో ఆ పుత్రుడు పక్షి ప్రవరుడైన సుపార్శ్వుడే
తగు విధముగా ఆహారము ఇచ్చి నన్ను పోషిస్తున్నాడు. మా ఆకలి ఎంతో తీవ్రమైనది. ఒకనాడు నేను
ఆకలి బాధచే పీడింపబడుచున్నాను, కాని నా కుమారుడు ఆలస్యముగా వట్టి చేతులతో తిరిగివచ్చాడు.
అందువలన నేను అతనిని చాలా పరుషముగ దూషించాను. అతడు వినయముగా నాతో ఇట్లా పలికడు - “నేను
ఆహారమునకై తగిన సమయమున ఆకాశమునందు ఎగిరి తిని, మహేంద్రగిరి ద్వారమును అడ్డగించి నా
ముక్కును వంచి సముద్రములోని ప్రాణులను చూస్తున్నాను. అప్పుడు అక్కడ నేనొక కాటుక కొండవలె
ఉన్న బలవంతుడైన ఒక పురుషుని చూచాను. అతడు నేను చూస్తుండగానే అలౌకిక తేజస్సంపన్నులాఇన
ఒక స్త్రీని బలాత్కారముగ తీసికొనిపోవుచున్నాడు. ఆ స్త్రీ పురుషులద్వారా నేను మీ ఆకలిని
తీర్చుటకు నిశ్చయించుకున్నాను. కాని మధురము వినమ్రమైన ఆ పురుషుని వాక్కుచే ప్రభావితుడనై
నేను అతనిని విడిచిపెట్టాను.
అనంతరము నాకు
మహర్షుల వలన సిద్ధపురుషులవలన ఆ అలౌకిక తేజస్సు కలిగిన స్త్రీ దశరథనందనుడైన శ్రీరామచంద్రుని
భార్యయైన సీత అనీ, ఆ నల్లని పురుషుడు లంకాధిపతియైన రావణుడనీ విన్నాను. సీతా దేవి జుట్టు
విడిపోయి ఉంది. ఆమె మిగుల దుఃఖముతో రామలక్ష్మణుల నామములను ఉచ్చరిస్తూ విలపించుచుండెను.
ఆమె ఆభరణములు జారిపోతున్నాయి. అందువలన నేనిచటికి వచ్చుట ఆలస్యమైనది.
టెక్కలు లేనివాడను,
నిస్సహాయుడను, వివశుడను అయిన నేను గిలగిలలాడుతూ ఉన్నాను. ఏమీ చేయ లేక పోయాను. దుష్టుడైన
రావణునిశక్తి నాకు తెలిసే ఉన్నది. అందువలన జగదంబయైన సీతా దేవిని రక్షింపలేకపోవుటచే
నేను అతనితో కఠినముగా పలికాను”.
తస్యా శ్రుత్వా
విలపిం తౌ చ సీతావియోజితౌ ||
న మే దశరథ స్నేహాత్-
పుత్రేణోత్పాదితం ప్రియమ్ |
(వా. రా.
4–68–7–8)
No comments:
Post a Comment