ప్రేమ, శాంతులే ఎల్లెడలా వెల్లివిరియాలని భావించాడు. మంచివి, నాశనమైపోతూ ఉంటే మనం నిర్లిప్తులమై ఉండడాన్ని అతడు సహిస్తాడా? ప్రేమతో, ఉత్సాహంతో చేసే పనులన్నిటినీ హర్షిస్తాడు. అనుగ్రహిస్తాడు.
అతడు, అజాడ్యాన్ని
మనపై కురిపించుగాక.
అమరుడైన ఆంజనేయుడు
అతణ్ణి చిరంజీవిగా
కీర్తిస్తాం. అయితే పాపపుపనులు చేస్తూ చాలాకాలం బ్రతికిన వాణ్ణి పాపీ చిరాయుః అని అంటాం
కదా! ఇట్టివాడు బ్రతికిన కొద్దీ వయోభారంచే అనేక రోగాలు, ఇతరులపై ఆధారపడడం, తన కళ్లముందే
తనకంటే చిన్నవారు చనిపోవడం చూస్తాడు.
అయితే చిరంజీవియైన
హనుమను, రాముడు తనతో బాటు తీసికొని పోయాడా? పరమపదానికి తీసికొనిపోక ఈ లోకంలోనే ఎందుకుంచాడు?
అయోధ్యా నగరవాసులందరూ రాముణ్ణి అనుగమించారు కదా. హనుమను పక్షపాతధోరణిలో చూడడమేమిటి?
No comments:
Post a Comment