Friday 4 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 241 వ భాగం



పంచాయతన మూర్తులు


చాలామంది ఒక్కొక్క ఇష్టమైన మూర్తిలోని కొలుస్తూ ఉంటారు. శంకరులు అందరి మనస్తత్వాలకు అనుగుణంగా భిన్న దేవతలపై స్తోత్రాలు చేసారు. వారు వ్రాసిన ప్రపంచ సారతంత్రంలో భిన్న దేవతల పూజా పద్ధతులున్నాయి. ఈశ్వర, శక్తి, విష్ణు, సూర్య, గణపతి, సుబ్రహ్మణ్యులు ఆర్గురు మూర్తులు. అందుకే షణ్మతస్థాపనాచార్యులైనారు. స్మార్తులకు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం ఉండకూడదు. కనుక వారికి పంచాయతన పూజ ఏర్పాటు చేసారు. ఈ విషయం, మార్కండేయ సంహితలో ఉంది.


ఇందు తమ ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టి మిగిలిన మూర్తులను నాల్గు దిక్కులా ఉంచుతారు. ఏ కోణంలో ఏ మూర్తిని పెట్టాలో కూడా చెప్పారు.


మా మఠంలో చంద్రమౌళీశ్వర లింగం, మధ్యలో ఉంటుంది. అమ్మవారిని ఒకమూల ఉంచకుండా, అయ్యవారి ప్రక్కనే ఉంచుతారు. అనగా ఆమెకు సమ ప్రాధాన్యమిచ్చినట్లే.


ఈ ఐదు మూర్తులూ ఐదు రాళ్ళ రూపంలో ఉంటాయి. అంతేనేకాని కన్నులు, ముక్కులూ ఉన్న మూర్తులు కావు. విష్ణుమూర్తి యొక్క శిల, నేపాల్లోని గండకీ నదిలో దొరుకుతుంది. అమ్మవారి స్వర్ణ రేఖాశిల, గూడూరు దగ్గర స్వర్ణముఖీనదిలో లభిస్తుంది. గణపతి శిల, శోణ భద్రలోని ఎర్రని శిలయే, తుంగభద్ర అన్నట్లుగా శోణభద్ర. అది శోణ్ నది. ఈ నది గంగలో కలుస్తుంది. సూర్యమూర్తి, స్ఫటికాకారంలో ఉంటుంది. ఈ స్ఫటికాన్ని త్రవ్వి తీయనవసరం లేదు. ఇది తంజావూర్లో వల్లం దగ్గర సరస్సులో లభిస్తుంది.


No comments:

Post a Comment