ఈశ్వరుని లింగాకారంగానే ధ్యానించాలి. అందుకే ఆయన స్ఫటిక లింగాలనిచ్చాడు.
నిరాకారమైనదే అద్వైతానికి చేరువగా ఉంటుంది. అది ఆది, అంతము లేనిదని శ్లోకం అంటోంది. ఆ మాట అద్వైతానికి దగ్గరే. నిర్గుణ బ్రహ్మమునే పరమాత్మయని అద్వైతులంటారు. స్ఫటిక లింగానికి రంగు లేదు. అదీ అద్వైతానికి ఇష్టమే. పరబ్రహ్మలా శుద్ధమైనది. ఏ పువ్వును దాని దగ్గర పెడితే అదే రంగును చూపిస్తుంది.
అమృతంలో నెత్తి తడుపబడుట దయను చూపిస్తుంది. ఏది జ్ఞానామృతమో, ఏది చల్లనైనదో దానిచేత తడుపబడుతున్నాడు. పంచ భూతాలున్నట్లుగా పంచలింగాలనిచ్చాడు. అతడు పంచ కృత్యపరాయణుడు. అతనికి ఐదు ముఖాలు.
తెలిసి కొన్నవాడు, తెలియబడేది, తెలిసికొను బుద్ధి, ఒక్కటే అంటుంది అద్వైతం. అదే త్రిపుటి. ఇక్కడ కూడా త్రిపుటి యుంది. ఇచ్చినవాడు శివుడు. తీసుకున్నవాడు శివుడు, ఈయబడినది శివతత్త్వము.
అసలు శంకరులే స్ఫటిక చంద్రమౌళీశ్వరులని ఒక శ్లోకం గుర్తుకు వస్తోంది.
ఇది మాధవీయ శంకర విజయంలో ఉంది:
"మూర్ధని హిమకర చిహ్నం, నిటలే నయనాంక మంసయో శూలం వపుషి స్ఫటిక సవర్ణం ప్రాజ్ఞాస్తం మేనిరే శంభుం"
జ్ఞానులు, శిశురూపంలో నున్న శంకరులను చూసి రాబోవు విజయ చిహ్నాలను చూసారట. మూర్ధని హిమకర చిహ్నం నెత్తిపై చంద్రుని గుర్తుంది. అనగా చంద్రమౌళిత్వం; నిటలేనయనం = నుదుటి పై మాడవనేత్రముంది. అంసయోః శూలం = భుజాలపై శూలముంది. వపుషి స్ఫటిక సవర్ణం = మొత్తం శరీరం అంతా స్ఫటికంలా ఉందని. ఇతణ్ణి శంభునిగా గుర్తించారు పెద్దలు.
No comments:
Post a Comment