ముక్తి క్షేత్రంగా పిలువబడే కంచిలో వీరు ముక్తిని పొందారు. వీరికి ముక్తి అంటే ఏమిటి? వారే ముక్తి స్వరూపులు కదా! వారెప్పుడూ జీవన్ముక్తులే. అట్లా భౌతిక శరీరాన్ని విడిచి పెట్టారు. నేను విదేహ ముక్తిని గురించి మాట్లాడుతున్నాను. కామాక్షి సన్నిధిలో జరిగినట్లుంది. బృహత్ శంకర విజయంలో అమ్మవారి సన్నిధిలో బ్రహ్మతత్వంలో లీనమైనట్లుంది.
'దేవ్యాః పురః పరతరే పురుషే విలీయే'
ప్రాచీన శంకర విజయంలోనూ ఇట్లాగే ఉంది.
కామాక్ష్యా సవిధే సజాతు నివసన్ ఉన్ముక్త లోక స్పృహో
దేహం స్వంవ్యవహాయ దేవ్యాస్సుధామ ప్రపేదేపరం
ఉన్ముక్తలోక స్పృహ = ప్రపంచ సంబంధం విడిచి పెట్టి అని ఉంది. వారికెప్పుడైనా బంధం ఉందా? లేదు. లోకానుగ్రహం కోసం పర్యటించారు. ధర్మ మార్గంలో నడిపించారు. అట్టి కోరికనూ విడిచి పెట్టారన్నమాట.
దేహం స్వంవ్యవహాయ - అమ్మవారి ఎదురుగా నిలబడి విడిచారని,
ధామ ప్రపేదే పఠం - స్వస్థలానికి వచ్చారు. అది ఏది? బ్రహ్మ స్వరూపమే కేరళీయ శంకర విజయంలో అట్టి పరమ పదాన్ని వీరు పొందినా, కాంచీపురంలో ఉన్న ఆలయంలో మోక్షదాతగా నున్నారని చెప్పబడింది. అనగా వారి మూర్తి ఆలయంలో ఉంది కదా.
No comments:
Post a Comment