Sunday, 20 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 257 వ భాగం



దీనిని వీరు వ్రాసేరా? అమ్మవారిచ్చిందా? ఆమె ఈయగా లోకంలో వ్యాప్తి చేసారా? అనే సందేహాలు కల్గుతూ ఉంటాయి. ఈ కథ, అనేక శంకర విజయాలలో లేకపోయినా పరంపరగా వస్తోంది.


కథ ఇట్లా ఉంది. అమ్మవారు తాళపత్ర సంపుటినీయగా అది తీసుకొని వీరు తిరిగి వస్తూ ఉన్నప్పుడు కైలాసం నుండి మంత్రశాస్త్రం తరలింపబడుతూ ఉందని నందికేశ్వరుడు అడ్డుకొని దానిని లాగుకున్నాడట. కాని శంకరుల చేతిలో కొన్ని యుండిపోయాయట. 100 తాళ పత్రాలలో 59 నందికేశ్వరుడు లాగుకుంటే మిగతా 41 పత్రాలను శంకరులు తీసుకొని వచ్చారట.


అంతా చిక్కలేదని వీరు బాధపడుతూ ఉండగా అశరీరవాణి వినబడింది. "ఇదంతా నా క్రీడ. నీవు నా మిగతా 59 శ్లోకాలూ వ్రాయవలసింది. నీ మాటలలో వ్రాస్తే విందామని యుంది. మిగిలిన శ్లోకాలకు దీటుగా నీవు వ్రాస్తే సంతోషిస్తాను" ఇది అమ్మవారే అందిట. వీరు వ్రాసి, ఇవి నేను వ్రాసేనా? అవి నీ పలుకులే అన్నారు.


'త్వదీయాభిర్వాగ్ని స్తవ జనని వాంచాంస్తుతిరియం'


ఈ 59 శ్లోకాలూ అమ్మవారి శిరస్సునుండి పాదాలవరకూ ఆమె రూపవర్ణనతో ఉంటాయి. అందు మూడవ శ్లోకంలో అనగా మొత్తం వందలోని 44వ శ్లోకంలో సౌందర్యలహరి అనే మాట ఉంటుంది. మొత్తం దీనిని సౌందర్యలహరి అని; మొదటి 41 శ్లోకాలను ఆనందలహరియని మిగిలిన 59 శ్లోకాలను సౌందర్య లహరియని అంటారు. మొదటిభాగంలో ఎనిమిదవ శ్లోకంలో ఆనందలహరి అనే పదం 'చిదానంద లహరీం' వాడబడింది.


No comments:

Post a Comment