ఇక జైనులు అర్ధ బౌద్ధులు. వీరిని శంకరులు అర్ధ వైనాశికులని అన్నారు. అంతా శూన్యమని బౌద్ధులనగా కావచ్చు. కాకపోవచ్చు అనే ధోరణిలో వీరి సిద్ధాంతం సాగుతుంది. శరీరాన్ని అన్నివిధాలా శుష్కింపచేయాలని, అపుడాత్మనుండి కర్మను అట్లా విడదీయాలని వీరంటారు. దానిని Stoicism అంటారు. అనగా సుఖదుఃఖాల వలన వికారం పొందని స్థితి.
ఇక మీమాంసకులకు భక్తి లేదు, ఈశ్వరుడు లేదు, కేవలం వైదిక కర్మలనే చేయాలంటారు. సాంఖ్యయోగాలు, అద్వైతంలా కనబడినా పెక్కుమంది జీవులుంటారని అందువల్ల ద్వంద్వస్థితియని అంటారు. న్యాయ వైశేషికాలు కేవలం బుద్ధికి సంబంధించిన సిద్ధాంతాలు.
అన్ని సిద్ధాంతాలూ బుద్ధినుండి ప్రభవించినవే. ద్వైత, విశిష్టాద్వైతాలు కేవలం భక్తికే ప్రాధాన్యం ఇస్తాయి. వీరు ప్రేమకు, భక్తికి ప్రాధాన్యం ఈయగా పైవారందరూ బుద్ధికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే అద్వైతం ఏమంటోంది? ఇది ఒక ప్రత్యేక సిద్ధాంతమనే చట్రంలో ఇమడదు. జీవుడు, బ్రహ్మము వేరు కాదని, బ్రహ్మము నిరాకార నిర్గుణమని అద్వైతం చెబుతుందని అన్నా జీవుడు, సచ్చిదానందునిగా మారే దానిని గురించి చెప్పుతుందని అనడం సబబు.
ఇది జ్ఞాన మార్గం ప్రవచించిందని అన్నా, అది కేవలం బుద్ధి వల్లనే సాధ్యం కాదని, అభ్యసించిన దానిని, అంతరంగికంగా అనుభవంలోకి వచ్చినపుడు పట్టుబడినట్లని చెబుతుంది.
ఇందు చివరిదశలో మనస్సుండదు. ఆనందానుభవమే. దానినెట్లా వివరించగలం? అయితే ఇది కర్మమా? అట్లాగూ చెప్పలేం.
No comments:
Post a Comment