Tuesday 15 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 252 వ భాగం



చెన్నైలోని మైలాపురంలో అమ్మవారు, మయూరియై పూజించినట్లు కథ, తిరువాట్రియార్ వెళ్ళిన శంకరులు, అక్కడకూ వెళ్ళే యుంటారు.


శివానందలహరిని, శ్రీశైలంలో వ్రాసి యుంటారు. ఆలయ గోపురం ముందు ద్వారంలో శంకరుల మూర్తి యుంది. శ్రీశైలం దగ్గర హాటకేశ్వరంలో ఒక మఱ్ఱి చెట్టు దగ్గర, ఒక వాగు సమీపంలో కొంతకాలం నిష్ఠలో గడిపారు.


కన్నప్ప అనే భక్తుణ్ణి స్మరించారు కనుక కాళహస్తి వెళ్ళియుంటారు. అక్కడ అమ్మవారు జ్ఞానాంబ. అది ప్రసిద్ధ క్షేత్రం. తిరుపతి స్వామిని దర్శించి ధనాకర్షణ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అందుకే ఎప్పుడూ అక్కడ కానుకల వర్షం. పండర్ పూర్లో పాండురంగాష్టకం; ఒరిస్సాలో జగన్నాథాష్టకం వ్రాసేరు. ఆ ప్రదేశాలను దర్శించినట్లే.


ద్వారకలో మఠాన్ని స్థాపించారు. అచ్యుతాష్టకం, గోవిందాష్టకం, ఇంకా పెక్కు స్తోత్రాలు కృష్ణునిపై ద్వారకలో, మధురలో, బృందావనంలో వ్రాసి యుంటారు. అయోధ్యలో రామభుజంగ స్తోత్రం వ్రాసి యుండవచ్చు.


శివ స్తోత్రాలను కాశీలో వ్రాసేరు. దీనికి సాక్ష్యం, అన్న పూర్ణా స్తోత్రమే. కాశీ పంచకం, గంగాష్టకం, మణికర్ణికాష్టకం మొదలైనవి వ్రాసేరు. యమునపై వీరి అష్టకం ఉంది. నర్మదలో సన్న్యాసం పుచ్చుకున్నారు కదా. నర్మదాష్టకం వ్రాసేరు.


No comments:

Post a Comment