Monday, 14 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 12 వ భాగం



కనుక ప్రవృత్తి మార్గం, కర్మ యోగంగా మారితే, దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడితే జ్ఞాన మార్గం వల్ల నివృత్తి మార్గంలో ప్రవేశించాలని సారాంశం. మీమాంసకులు చెప్పిన కర్మ మార్గంలోనే మునిగితే ఇక నివృత్తి మార్గం ఎట్లా పట్టుబడుతుంది? అతని కాలంలో నివృత్తి మార్గం అడుగంటడం వల్ల మొత్తం ప్రవృత్తి నివృత్తి మార్గాలను పునరుద్ధరించడం కోసం అవతరించాడు.


శ్రీ కృష్ణుడు - శంకరులు


కృష్ణావతారంలో పరిస్థితులెట్లా ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా అవి శంకరుల కాలంలో ఉన్నాయి. ధర్మానికి హాని జరిగినప్పుడు తానవతరిస్తానని కృష్ణుడు మాట ఈయడం వల్ల శంకరులవతరించారు. కృష్ణుడు లేకపోతే శంకరుల అవతారమూ లేదు. శంకరులే భజగోవిందం అని నల్గడలా వ్యాపింపజేసారు. వారి కులదైవం కృష్ణుడే. శంకరులకంటే ముందుగా కృష్ణునకు జగద్గురువనే బిరుదుంది. జగద్గురువైనవాడు గీతోపదేశం చేయగా మన జగద్గురువులైన శంకరులు దానికి భాష్యం వ్రాసేరు. కనుక శంకరుల గురించి చెప్పేటపుడు ముందుగా కృష్ణుని స్మరించవలసి వచ్చింది. కృష్ణావతార పరిస్థితుల కంటె దిగజారిన పరిస్థితులలో శంకరులవతరించి వలసి వచ్చింది.


పూర్వావతారాలు


కృష్ణుని ముందు చాలా అవతారాలున్నాయి. వారెవ్వరూ ఉపదేశాలీయ లేదు. ఉపదేశం ఈయవలసిన పరిస్థితి, కృష్ణుని కాలంలోనే వచ్చింది. ఎందుకంటే కర్మయోగాన్ని తరతరాలనుండి అనుసరిస్తున్నారని కృష్ణుడు ముందన్నాడు కదా!


No comments:

Post a Comment