Tuesday, 22 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 20 వ భాగం



ఇక బుద్ధ మతం, ఇక్కడ పుట్టినా అంతరించి మిగతా దేశాలలో వ్యాపించింది. ఇక జైన మతానికి ప్రత్యేకత ఉన్నా హిందూ పూజా విధానాన్నే స్వీకరించింది. వీరికీ హిందువులకూ పరస్పర వివాహ సంబంధాలున్నాయి. శంకరుల భాష్యంలో దీనిని గురించి ఎక్కువగా ప్రస్తావింపబడలేదు. అంతేకాదు, బౌద్ధ మతాన్ని కూడా వీరు విస్తారంగా ఖండించలేదు. తరువాత దీనిపై చర్చిద్దాం.


ఈనాడు శైవం, వైష్ణవం ఉన్నా శంకరులు ఖండిచిన శైవ వైష్ణవ సిద్ధాంతాలు వేరు, శంకరుల తరువాత వచ్చిన ఆచార్య పురుషులు శంకరుల కాలంలోని ఈ మతాలలో కొన్నిటిని గ్రహించి యుండవచ్చు. రామానుజుల వైష్ణవంలో పాంచరాత్ర సిద్ధాంతాలున్నాయి. అట్లాగే సిద్ధాంత శైవంలో శంకరులు ఖండించిన పాశుపత సిద్ధాంతాలున్నాయి. కనుక ఈనాడు ప్రచారంలో ఉన్న శైవ వైష్ణవాలకు క్రొత్త రూపును సంతరింప చేసారు పై ఆచార్య పురుషులు.


న్యాయ మీమాంసలను నేడధ్యయనం చేస్తున్నా వీటి అనుయాయులు నేడు లేరు. అంటే న్యాయ మతాలవలంకులు, మీమాసంతావలంబకులు లేరన్నమాట. ఈనాడు యోగాన్ని అభ్యసిస్తున్నా యోగమతాన్ని అనుసరిస్తున్నామని ఎవ్వరూ అనరు. ఇట్లా అనేక మతాలు కనుమరుగైపోయాయి.


శంకరుల అద్భుత కృత్యం చాలా మతాలు నేడంతరించాయని దీనికి కారణం ఒక సన్న్యాసి అంటే వారి ఆధ్యాత్మిక శక్తి, మేధా సంపదన వాదనా పటిమలను చూసి అట్టి వారిని అవతారమని కీర్తించమా? వారు జీవించిన కాలం 32 సంవత్సరాలే కదా!


No comments:

Post a Comment