గీతలో యోగాలు
ఇందు 18 అధ్యాయాల పేర్లలో యోగం అని యుంటుంది. మొదటి అధ్యాయమే అర్జున విషాదయోగం. దీనిని యోగం అనడం ఏమిటి?
అసలీ పేర్లు ఎవరు పెట్టారు? సమాధానం చెప్పలేం. భగవానుడు ఉపదేశించాడని నమ్మితే చాలు. వ్యాసుడే ఉంచాడన్నా తప్పులేదు. వ్యాసుడు కూడా అతని అంశావతారమేకదా!
విషాదం ఎట్లా యోగమౌతుంది? ఇందాత్మ గురించి అర్జునుడాలోచించడం లేదా? అది ఒక కారణం. అంతకు ముందు అన్నిటిని జయించి విజయుడయ్యాడు. యుద్ధ రంగంలో బంధువులను చూసి వీరిని చంపడమా? దీనికంటే ముష్టి ఎత్తుకోవడం మేలని భావించాడు. పరిపక్వమైన మనస్సులో పుట్టిన విరక్తి కాదిది. కాని అజ్ఞానం వల్ల పుట్టిన మమకారం వల్ల వీళ్ళు నావాళ్ళని భావిస్తున్నాడు. ధర్మయుద్ధం చేయవలసినవాడు ఇట్లా బెంబేలు పడడాన్ని కృష్ణుడు ఛీత్కరించాడు. ఈ విషాదాన్ని చూసే భగవానుడు, ఉపదేశం చేయవలసి వచ్చింది. ఎన్నిటిలోనో సాయం అందించిన కృష్ణుడు (సుభద్రా వివాహం మొదలైనవి) జ్ఞానోపదేశం చేయడానికి ఇంతవరకూ అవకాశం చిక్కలేదు. ఇతని తాత్కాలిక విషాదం, మంచితో సమాప్తమైంది కనుక ఇది విషాదయోగమైంది.
పరమాత్మతో ఏ రకమైన సన్నివేశమైనా అది యోగంగా మారుతుంది. లోకంలో ఫలానా వాడికి యోగం బాగుంది కాబట్టి అంత సంపాదించాడు అంటారు. ఏమిటి దీని అర్ధం? జాతకంలో గ్రహాల కలయికను బట్టే కదా! అన్ని యోగాలలో ఏది గొప్పది? పరమాత్మతో ఐక్యం కావడం గొప్ప యోగం.
No comments:
Post a Comment