Thursday 18 May 2023

శ్రీదత్త పురాణము (142)

 


ఆత్మ జ్ఞానం


ప్రతిష్టానపురంలో ఒక బ్రాహ్మణుడు వున్నాడు. అతడు జ్ఞానవిజ్ఞానపారంగతుడు. ఆయనకు లేక లేక ఒక ముగ బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డడు పుట్టినప్పటి నుండీ ఏ చైతన్యమూ లేకుండా ఒక జడ పదార్థంలాగా వుంటున్నాడు. శారీరక ఎదుగుదలవుంది కానీ మానసిక చైతన్యం కనిపించడం లేదు. వీధిలోకి రాడు. ఎవరితోనూ కలవడు. ఆటపాటలు లేవు. పెడితే తింటాడు. పెట్టకపోతే పస్తుంటాడు. ఇది తినవచ్చు ఇది తినకూడదు. ఇంత తినవచ్చు ఇంత తినకూడదు అనే విచక్షణా జ్ఞానం లేదు. మలమూత్రాలకు తేడా లేదు. నిలబడివుంటే నిలబడ్డ చోట కూర్చుంటే కూర్చున్న చోటే పడుకుంటె పడుకున్న చోటే అన్నీను. ఏదో పిశాచం పట్టిన వాడిలా ఎప్పుడూ ఏకాంతాన్నే కోరుకుంటూ ఎవరితో కలవాలన్నా, పలకాలన్నా, భయపడుతూ, చదువు సంధ్యలూ లేకుండా ఇంటిలోనే పడివున్న కొడుకును చూసి ఆ దంపతులు ఎంతో కుమిలిపోతూవుండేవారు. దానధర్మాలు, తీర్ధయాత్రలు, నోములూ, జపాలూ, వ్రతాలు, గ్రహశాంతులూ అన్ని అయ్యాయి. అన్నిరకాల వైద్యాలు అయ్యాయి. సొమ్ము కరిగిపోయింది కాని కుర్రవానిలో మాత్రం మార్పులేదు. విష్ణుదత్తుడి మహిమ గురించి విని ఆదంపతులు బిడ్డను తీసుకొచ్చారు. చూపించి పరిస్థితి వివరించారు. మహానుభావా మాకు ఒక్కగానొక్క కొడుకు దయచేసి వీడ్ని మామూలు మనిషిని చెయ్యి - అని పాదాల మీద పడి ప్రార్ధించారు.


విష్ణుదత్తుడు ఆ బిడ్డడి వైపు నిశితంగా చూసాడు. విషయం అర్ధమయ్యింది. అతడిని తన దగ్గర వుంచుకొని తల్లిదండ్రుల్ని భోజనం చెయ్యమని చెప్పి లోపలకు పంపించాడు. వాళ్ళు అలా ళ్ళగానే ఆ బిడ్డడుతో విష్ణుదత్తుడు ఇలా సంభాషించాడు. 


బ్రహ్మాన్ తమరెవరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? పని ఏమిటి? ఏమి చేస్తున్నారు? హాయిగా మీ ఇంటికి మీరు వెళ్ళండి. సుఖాలు అనుభవించండి. సుఖంగా భుజించండి. ఇప్పుడు నన్ను ఏమిచెయ్యమంటారో చెప్పండి. ఈ జడ్డి తనాన్ని వదిలెయ్యండి. అని విష్ణుదత్త యోగి అనేసరికి ఆ శిశుయోగి పెదవి విప్పి ఇలా పలికాడు.


No comments:

Post a Comment