Tuesday 23 May 2023

శ్రీదత్త పురాణము (147)

 


ఇంత వరకు చెప్పిన వేద ధర్ముడు కొంత సమయం ఆగాడు. అపుడు దీపకుడు గురుదేవా-వేదధర్మ స్వరూపా సార్ధక నామధేయా- నీ దయవల్ల అతి పురాతనమైన ఇతి హాసాన్ని హృదయానందదాయకమైన దత్త స్వామి మహత్యాన్ని వినగలిగాను. తత్వవిశ్చయమైన ఈ ఇతిహాసం చాలా విచిత్రంగా వుంది. ఆకర్షణీయంగా కూడ వుంది. దీన్ని వింటే సాధారణమానవుడు సైతం అతి కష్టమైన పరతత్వాన్ని మెల్లమెల్లగా తెలుసుకోగలుగుతాడు. తప్పులుగా, మహాపాపాలుగా, దోషాలుగా కొందరిలో చెప్పబడుతున్న వాత్సాయన కామ సూత్రాదిశాస్త్రాలు కూడా చివరకు బ్రహ్మతత్వంలోనే లయమవుతున్నాయి- అని ఇప్పటికి తెలుసుకోగలిగాను. -


కార్తవీర్యార్జునునికి దత్తయోగీంద్రుడు చేసిన తత్వబోధను కూడా దయచేసి సవిస్తరంగా తెలియజెయ్యండి. ఆలకించి ధన్యుణ్ని అవుతాను అని దీపకుడు సవినయంగా ప్రార్ధించాడు. వేదధర్ముడు సరేనని ప్రారంభించాడు.


దత్తస్వామి కార్తవీర్యార్జునుకి చేసిన బోధ


సాష్టాంగ నమస్కారంచేసి తనకు చేరువలో నిలబడ్డ కార్తవీర్యార్జునుణ్ని తనకు దగ్గరగా కూర్చోపెట్టుకొని దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ అతనివైపు ఒకసారి చూసి ఇలా అన్నాడు. వత్సా కార్తవీర్యా! ఇంతకు ముందు నువ్వు ధర్మార్థకామాల స్వరూపాల గురించి అడిగావు వాటిని నీకు అమగ్రహించాను. ఇప్పుడు తురీయమైన పురషార్థ మోక్షం గురించి అడుగుతున్నావు. భక్త పరాధీనుణ్ని కనుక అదీ అనుగ్రహిస్తున్నాను. ఆకలిగా వున్నప్పుడే అన్నము, దాహముగా వున్నప్పుడే నీళ్ళూ, రోగం వచ్చినప్పుడు మందు, బంధనంలో వున్నప్పుడే విమోచనం, నిద్ర వస్తున్నప్పుడే శయనము, ఇలా ఏది అవసరమైనప్పుడు ఏది కోరినప్పుడు దానిని ఇవ్వాలి. అవసరం లేనప్పుడు ఇవ్వడం గాని ఒకటి.

దాహముగా వున్నప్పుడే నీళ్ళూ, రోగం వచ్చినప్పుడు మందు, బంధనంలో వున్నప్పుడే విమోచనం, నిద్ర వస్తున్నప్పుడే శయనము, ఇలా ఏది అవసరమైనప్పుడు ఏది కోరినప్పుడు దానిని ఇవ్వాలి. అవసరం లేనప్పుడు ఇవ్వడం గాని ఒకటి ఇవ్వవలసిన సమయంలో ఇంకొకటి ఇవ్వడంగానీ కోరనిది ఇవ్వడం గానీ జరిగితే వ్యర్ధమవుతాయి.


No comments:

Post a Comment