మనకెన్నో పవిత్ర దివసాలున్నాయి. అన్నిటికంటె శంకర జయంతినే బాగా ఎందుకు జరుపుకోవాలి?
శంకరులు పుట్టిన తరువాతనే ఆ పవిత్ర దివసాల ప్రాముఖ్యాన్ని గుర్తించాం. ఎందుకంటారా? వేద, శాస్త్ర, పురాణ, శాస్త్రాల పునరుద్ధరణ ఇప్పటినుండే జరిగింది కనుక.
బౌద్ధం, జైనం, మీమాంసమతం విజృంభించి యుంటే శివరాత్రి వంటివాటిని ఎవరు జరుపుకుంటారు? శంకర జయంతి వల్లనే ఆ పండుగలను, జయంతులను జరుపుకుంటున్నాం. జయ జయ శంకర అంటూ జరపండి.
ఘనంగా జరపండి
శంకర జయంతి లేకపోతే రామనవమి, కృష్ణాష్టమి ఉండేవా! మన శ్రేయస్సుకై జరపండి. కృతజ్ఞత మనకుండాలి. ఏదో మ్రొక్కుబడిగా కాదు. దీని విశిష్టతను గుర్తించి జరపండి.
వైష్ణవాలయాలలో ఆళ్వార్లు, రామానుజులు, వేదాంత దేశికుల మూర్తులుంటాయి. అట్లాగే శివాలయాలలో నాయనార్ల విగ్రహాలుంటాయి. వారి జయంతులను వారు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. శంకరులు శైవులూ కాదు, వైష్ణవులూ కాదు. స్మార్త సంప్రదాయానికి చెందినవారు, అన్ని సంప్రదాయాలను గౌరవిస్తారు కనుక వీరికి ప్రత్యేకంగా విగ్రహం అంటూ ఉండదు. వీరు యంత్ర ప్రతిష్టాపన చేసిన ఆలయాలలో అక్కడక్కడ వీరి విగ్రహముంటుంది.
No comments:
Post a Comment