వారి అవతార దివసాన్ని చూసి పేరు పెట్టారని గమనించండి. వైశాఖ శుద్ధ పంచమినాడు ఐదవ తిథి, ఒకటవ పక్షం, రెండవ మాసం. శ అంటే 5. అంటే ఒకటి ర అంటే 2. దీనిని తిరుగవేయండి. రెండవ మాసం, మొదటి పక్షం, ఐదవ తిథి కావడంచే శంకర అనే పేరు వస్తుంది. భగవంతుడనే కాకుండా పుట్టిన మాసం, తిథి, పక్షాన్ని బట్టి శంకర పదం ఉంచారు.
ఆంగ్లంలోనూ ఈ పద్ధతియుంది. దీనిని వీరు Chronogram అంటారు. రోమన్ అంకె 1 ఒకటవుతుంది. V=5; X=10 అవుతాయి.
శంకరులు ఎంత కాలం బ్రతికారన్నది కూడా ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది. ఫలే స్వస్మిన్ స్వాయుషి అని ఉంది. ఫ అనగా 2; ల అనగా 3. ఫల అనగా 23. త్రిప్పితే 32 సంవత్సరాలు. ఇప్పటికి 2500 సంవత్సరాల పూర్వం వారున్నారని తేలింది.
వసంత ఋతువు - వైశాఖ మాసం
మాసానికి, మల్లెకు, శారదకు, శంకరులకు గల సంబంధాన్ని చెబుతా. వైశాఖ మాసంలో పుట్టారు. విశాఖ యనగా కొమ్మలు లేనిది. లతకు కొమ్మలుండవు. దీనిని మాధవ మాసం అంటారు. చైత్రాన్ని మధువని అంటారు. మాధవి యనగా మల్లె. దీనికి కొమ్మలుండవు కనుక రెండు మాసాల పేర్లు దీనికి చెందినది. వసంతం నుండి వాసంతి వచ్చింది. మల్లెకు వాసంతి యని కూడా పేరు.
No comments:
Post a Comment