Friday 5 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 151 వ భాగం



ఈ ఉత్సవంలో శంకరుల ఉత్సవమూర్తిని ఊరేగిస్తూ గాయత్రీ మండపం దగ్గరకు తీసుకొని వచ్చి ప్రతిరోజూ సౌందర్య లహరిలోని పది శ్లోకాలను పఠిస్తారు. చివరి రోజున ఒక ప్రత్యేకత యుంది. ఇక్కడ శుక్రవారమంటపం ఉంది. మామూలు ఉత్సవాలలో అమ్మవారిని ఈ మంటపం పై అధివసింపచేస్తారు. శంకర జయంతి ఉత్సవాలలో చివరి రోజున అమ్మవారు శంకరుల ఉత్సవమూర్తులను రెండింటినీ ఇక్కడ కూర్చుండబెట్టి చివరి పది శ్లోకాలను చదువుతారు. అమ్మవారి ప్రసాదం, వస్త్రం, శంకరులకు నివేదిస్తారు. ఇట్లా అన్నిచోట్ల జరగాలని నా ఆకాంక్ష.


మనస్సునర్పించుట మౌన ధ్యానం-


శంకర జయంతికి డబ్బు ఖర్చు పెట్టుట కంటె వారికి శరణాగతి పొందుటయే సరియైన పూజ, మనస్సు సమర్పించుటయే ముఖ్యం.


భగవంతుని పూజించుట కంటె శంకరులను స్మర్శిస్తేనే శాంతి కలుగుతుంది. మన కర్మానుసారంగా శిక్షించే వాడు శంకరుడు. కాని శంకరులు మనకు మంచిని చేస్తారు.


ఎట్లా వారిపై మనస్సును నిలపాలి? 'హరహర శంకర, జయ జయ 'శంకర' అంటే చాలు. హర హర నామమే అన్నిటినీ హరిస్తుందని జ్ఞాన సంబంధులనలేదా? శంకరులు దిగ్విజయం చేసారు కనుక జయ జయ శంకరను కలుపుదాం.


అనవసరమైన వివాదాలతో కాలం గడుపుతారేమిటి? శంభుని తలుచుకొని పరమానందం పొందండని వీరనలేదా?


"వృథాకంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్బుజ పరమసౌఖ్యం ప్రజ సుధీః"


No comments:

Post a Comment