Saturday, 20 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 166 వ భాగం



ఇక శివభుజంగ స్తోత్రంలో సుతాద్రోహి అనే మాట వస్తుంది. అది కూడా వేరే శంకర నామ ధేయులు వ్రాసియుంటారు. 


ఇక పూర్ణ వర్మ గురించి దానిని బట్టి కాలాన్ని చెప్పలేం. మనం ఏ వెంకయ్యో, పుల్లయ్యో అన్నట్లు; ఆంగ్లేయులు టామ్, డిక్, హ్యారీ అన్నట్లు ఏదో రాజునకు ఏదో పేరుంచాలి కనుక అట్లా పేరు వ్రాసేరని ఊహించవచ్చు. భాష్యాలలోనే యజ్ఞదత్త, దేవదత్త అనే పేర్లు వస్తాయి. అట్లా వారున్నారని కాదు. ఏదో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పడం కోసం అట్లా సంస్కృత సాహిత్యంలో పేర్లుంటాయి. అట్లాగే పూర్ణ వర్మ అని యంటారు. సత్ ని పూర్ణంగా, అసత్ ని శూన్యంగా చెప్పడం కోసం గొడ్రాలు కొడుకని చెప్పి యుంటారు.


మగధరాజు పూర్ణవర్మ మరల బోధివృక్షాన్ని నాటాడని పేర్కొన్నాను కదా! అనగా ఫాహియాన్ పేర్కొన్నవాడు బౌద్ధుడు. అట్టి బౌద్ధ దృష్టాంతాన్ని శంకరులు చెప్పాలా? చెప్పి యుంటారా? ఆ చిన్న రాజును గురించి ప్రస్తావిస్తారా? శూన్యవాదిని పూర్ణవర్మ చేయడమా? (అని నవ్వుతూ అన్నారు.)


అభినవ శంకరులు


కాంబోడియా శాసనంలో భగవత్ శంకర అని యుంది కనుక వారు ఆదిశంకరులే కావాలి. శాసన కాలం క్రీ.శ. 8వ శతాబ్దమని తెలుస్తోంది. 


దీనికేమి సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. శంకరుల తరువాత అనేకులు పీఠాలను అధిరోహించారు. మహమ్మదీయులను దండయాత్రల నుండి హిందూ మతాన్ని రక్షించిన విద్యారణ్య స్వామి అట్టివారే, ద్వైత సిద్ధాంతం నుండి, వీరశైవం నుండి వచ్చే దాడుల నెదుర్కున్నారు. వారు విజయనగర సామ్రాజ్య కారకులు.


No comments:

Post a Comment