శంకరుల స్తోత్రాలలో కాలనిర్ణయం
శంకరులు, సౌందర్యలహరిలో, అమ్మా! నీవు దయతో ద్రవిడ శిశువునకు పాలనీయడంచే అతడు మహాకవి అయ్యాడని ఉంది. అతడే జ్ఞాన సంబంధుడు. అతడు క్రీ.శ. 7వ శతాబ్దానికి చెందినవాడు. అప్పర్, మహేంద్రవర్మ అనే పల్లవరాజును జైన మతం నుండి వైదిక మతానికి మార్చినవాడు, జ్ఞానసంబంధుడు. మారవర్మన్ అరికేసరి అనే పాండ్యరాజును జైనాన్నుండి మార్చినవాడు. ఈ రాజు ఏడవ శతాబ్దంలో పాలించాడు కనుక సంబంధుడు ఏడవ శతాబ్దంలో ఉన్నాడు. అతణ్ణి శంకరులు పేర్కొన్నారు కనుక తరువాతి వారే అవుతారు. అప్పర్, జ్ఞాన సంబంధులు, సమకాలికులు.
మహేంద్రవర్మ తరువాత నరసింహ వర్మ వచ్చాడు. బ్రాహ్మణుడైన పరంజోతి అనే సైన్యాధిపతి, శివ భక్తుడై చిరుతొండ నాయనార్ గా ప్రసిద్ధి పొందాడు. ఇతడే వాతాపిపై ఏడవ శతాబ్దంలో దండెత్తి చాళుక్య రాజును ఓడించాడు.
ఇతని ప్రస్తావన శంకరుల శివభుజంగ స్తోత్రంలో ఉంది. అందు భార్యకు, తనయునకు, తండ్రికి ద్రోహం చేసిన వారి మాదిరిగా నేను చేయలేదు. అట్టి ద్రోహం చేసినవారిని రక్షించావని శివుణ్ణి నిందాస్తుతిని చేసారు.
చిరు తొండనంబి కథ ప్రసిద్ధమైనది. బ్రతికియున్న కొడుకును చంపి ఆ మాంసాన్ని వండి వడ్డించిన కథ అందరికీ తెలిసిందే. అనగా సుతాద్రోహి అయ్యాడు. ఈశ్వరుడు, శివభక్తునిగా వచ్చి 'ఇయర్ పగైనాయనార్' అనే భక్తుడి భార్యనే అడిగాడు. అట్టివాడు కాంతాద్రోహి.
No comments:
Post a Comment