Sunday 7 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 153వ భాగం



ఉదాహరణకు 'జయ'ను చూడండి:


'జ' అనగా 8; 'య' అనగా 1, జయ-81. దానిని పై సూత్రం వల్ల త్రిప్పితే 18 అయింది.


గీతలో ధ్యానానికి చైలాజినకుశోత్తరం అని యుంది. చైలం =బట్టి, అజినం చర్మం, కుశ=దర్భలు. ధ్యానానికి ముందు నేలపై బట్టను వేసి దాని పై చర్మం ఉంది దానిపై దర్భలని చెప్పకూడదు. దానిని తలక్రిందులుగా చేయాలి. ముందు దర్భ, దానిపై చర్మం, దానిపై బట్టయని అర్థం చేసుకున్నట్లే పైన కూడా.


కటపయాదితో సిద్ధిని పొందిన సంవత్సరం


పుణ్యశ్లోక మంజరి అనే గ్రంథంలో 55వ పీఠాధిపతివరకు ఉన్న వారి పేర్లు, స్థలము, ఎక్కడ సిద్ధి పొందినవి మొదలైన వివరాలున్నాయి. తరువాత వచ్చినవారు అనుబంధాన్ని చేర్చారు. ఇట్లా 60వ పీఠాధిపతి వరకూ ఉన్నాయి. శ్లోకం'శర చరా అని ఉంది.


ఫలే స్వస్మిన్ స్వాయుష్ శరచరాబ్దేఽ సకలేః

విలీయే రక్తాక్షిన్ యతివృష సిద్ధై కాదశిపరే


ముందుగా వీరెప్పుడు సిద్దిని పొందారో వివరిస్తారు. శరచరాబ్దంలో 


అనగా రక్తాక్షి సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశినాడు సిద్ధిని పొందారు. 'శ' వర్ణం ఐదును సూచిస్తే 'ర' రెండును చెబుతుంది. 'కాదినవ' అనే సూత్రం ప్రకారం 'చ' ఆరును చెప్పగా 'ర' రెండును చెబుతుంది. దీనిని తల్లక్రిందులు చేస్తే 2625 అయింది. అనగా కలియుగం ఆరంభమైన వెనుక 2625 సంవత్సరంలో సిద్ధిని పొందారు. అంటే కలిలో క్రీ.పూ.477. వారు 32 సంవత్సరాలు బ్రతికారు. దానికి 32ను కలిపితే క్రీ.పూ. 509 అయింది. అది నందననామ సంవత్సరం. 


No comments:

Post a Comment