Tuesday, 9 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 155 వ భాగం



మల్లెపువ్వులున్న ఋతువులో, మాసంలో వీరి అవతారం కనుక శుద్ధ సత్త్వాన్ని, చల్లదనాన్ని సూచిస్తుంది. ఈ మల్లెకు వీరి మాటలకూ ఉన్న సంబంధాన్ని చెబుతా, మఠంలో శ్రీముఖం ఇచ్చేటపుడు శంకరుల వాక్కును ఇట్లా పోలుస్తారు:


అతలిత సుధారస మాధుర్య కమలాసనకామినీ 

ధమ్మిల్ల సంపుల్ల మల్లికా మాలికా నిష్యంద మకరంద 

ఝరీ సౌవస్తిక వాఙ్నగుంభ విజృంభణానంత తుందిలిత మనీషి మండలానాం 


అనగా సరస్వతీ దేవి, పద్యంపై అధివసించి యుండి కొప్పులో మల్లెపూవులను తురుముకొంది. శంకరులు అమృత రసంతో కూడిన వాక్కులనందిస్తూ ఉంటే విద్వాంసులు సంతోషిస్తున్నారు. ఆ మల్లె పూవులనుండి వచ్చు మకరందం కూడా వీరి వాక్కులతో సాటిరాదని అర్ధం.


శంకరులు, సరస్వతితో వాదించి ఓడించి వారి సర్వజ్ఞత్వాన్ని చాటారు. సరస్వతిని శృంగేరిలో శారదాపీఠంలో ప్రతిష్టించారు. సన్న్యాసులు పది నామాలతో వ్యవహరింపబడుతూ ఉంటారు. దానిలో భారతి నామం, శృంగేరీ సన్న్యాసులకుండగా, కంచిలో సరస్వతి పేరుంటుంది. సరస్వతి సన్న్యాసులలో రెండు సంప్రదాయాలున్నాయి. ఆనంద సరస్వతి, ఇంద్ర సరస్వతీయని, కంచిలో ఇంద్ర సరస్వతులుంటారు. శృంగేరీ పీఠాన్ని శారదా పీఠమంటారు. కంచి మఠాన్ని శారదా మఠమంటారు. సరస్వతి, మల్లెలా స్వచ్ఛమైనది. అందలి మకరందం కంటె శంకరుల వాక్కులో మాధుర్యం ఉంటుంది. కనుక వీరు వైశాఖ మాసంలో పుట్టడమూ సబబే.


No comments:

Post a Comment