Sunday, 21 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 167 వ భాగం



అట్లాగే అభినవ శంకరులు కూడా. కంచి మఠంలో వీరు 38వ పీఠాధిపతి, వీరి జీవితం గురించి శంకరేంద్ర విలాసం, సద్గురు సంతాన పరిమళం గ్రంథాలలో చూడవచ్చు. శంకరుల తరువాత 1300 సంవత్సరాలకు వచ్చి శంకరులు చేసిన అవైదిక మత నిర్మూలనం వీరూ చేసారు. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. వీరితర దేశాలకు వెళ్ళినట్లు కూడా ఉంది. చీనా, తుర్కిస్థాన్, బాహ్లిక (ఆఫ్ఘనిస్తాన్లో ఒక భాగం) రాజ్యాలకు వెళ్ళినట్లు, గుణరత్నమాల అనే గ్రంథం చెబుతోంది. ఆ దేశాలవారు, వీరిని తమ గురువులుగా కీర్తించారని ఉంది.


"చీన తురుష్క - బాహ్లికాత్యైః స్వరూపాచార్య తయాస్తుతం (శ్లో. 66)


శంకరులతో సమానమైన వారిని ఆదిశంకరులుగా భావించి లోగడ పేర్కొన్న 'నిధి నాగ' శ్లోకాన్ని ఆది శంకరులకు ఆపాదించారు. ఈ శ్లోకంలో పేర్కొనబడిన శంకరులు, అభినవ శంకరులే. చాలామంది ఎనిమిదవ శతాబ్దానికి చెందినవారు, ఆది శంకరులని భ్రాంతి పడడానికి కారణమైంది.


ఆది శంకరులు పుట్టినది, వైశాఖ మాసం, శుక్ల పక్షంలో, ఆది శంకరులు నందన నామ వత్సరంలో పంచమినాడు పుట్టగా వీరు విభవనామ సంవత్సర దశమినాడు పుట్టినట్లుంది. మరి ఇద్దరూ వేర్వేరు వ్యక్తులే కదా!


ఇట్లా వీరిద్దరూ ఒక్కరేయని భ్రాంతి పడ్డారు. కాంబోడియా శాసనంలో ఇంద్రవర్మ యొక్క గురువైన శివసోముని యొక్క గురువు శంకరులని యుండగా, శంకర విజయాలలో శంకరుల శిష్యుడు శివసోముడని ఎక్కడా లేదు. అయినా భ్రాంతి పడి వీరిని వారుగా భావించి యుంటారు.


కొంతమంది క్రీ.పూ. 44-12 అని అన్నారు. టి. ఎస్ నారాయణ శాస్త్రిగారు. జైనుల లెక్కలను బట్టి వారి యుధిష్టిర శకకాలాన్ని బట్టి అట్లా అన్నారు.

No comments:

Post a Comment