Saturday 6 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 152 వ భాగం



నామకరణం


శిశువు పుట్టీ పుట్టగానే చేసే సంస్కారం పేరు జాతకర్మ. తరువాత 11వ రోజున నామకరణం జరుపుతారు.


వీరికి శంకరులని నామకరణం చేసారు. శంకరుని అనుగ్రహం వల్ల పుట్టాడు గనుక బాగానే ఉంది. శంకరునకు అనేక నామాలున్నాయి. దీనినే ఎందుకు పెట్టినట్లు? శంభువు, నిష్క్రియుడు. శంకరులనగా లోకానికి మంచి చేసేవారని చెప్పాను. కనుక ఇది సార్ధకం.


ఏ కారణం లేకుండా దీనినుంచలేదు. పుట్టిన నెల, పక్షం, తిథికి అనుగుణంగా ఈ పేరుంది. ఇదీ విశేషం.


కటపయాది సంఖ్య


గణితానికి సంబధించిన కొన్ని సంకేతాలు తెలిస్తే ఏ సంవత్సరంలో పుట్టారో ఇట్టే మనకవగతమౌతుంది.


అంకెలను, అక్షర సంకేతాలతో చెప్పేవారు 'కాదినవ బాదినవ-పాది - పంచ - యాద్యష్టా' అని ఇట్లా గుర్తులున్నాయి. అంటే క మొదలు ఝ వరకూ తొమ్మిది అక్షరాలు, వరుసగా ఒకటినుండి తొమ్మిది వరకూ ఉండే అంకెలను గుర్తు చేస్తాయి. అట్లాగే ట మొదలు ధ వరకు ఉండే అక్షరాలు ఒకటినుండి తొమ్మిది వరకూ ఉండే అంకెలను గుర్తు చేస్తాయి. ప నుండి మ వరకూ ఉండే అక్షరాలు ఒకటి మొదలు ఐదు వరకూ ఉండే అంకెలను సూచిస్తాయి. య నుండి హ వరకు ఉండే అక్షరాలు ఒకటి మొదలు ఎనిమిది వరకూ ఉండే అంకెలను సూచిస్తాయి. అచ్చులు ఒక్కటే ఉంటే సున్నాలను సూచిస్తాయి. ఈ అంకెల్ని కుడినుండి ఎడమకు లెక్కించాలి. అనగా ఎడమవైపున ఉండేది ఒకట్ల స్థానమౌతుంది.


No comments:

Post a Comment