Wednesday 17 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 163 వ భాగం



ఇతడు సాండ్రకేటస్ పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్నట్లు వ్రాసేడు. అతడే మౌర్య చంద్రగుప్తుడని చరిత్రకారులు నిర్ధారణకు వచ్చారు.


కేవలం చంద్ర గుప్తుడని పేర్కొన్నాడే కాని, చంద్రగుప్తమౌర్యుడని పేర్కొనలేదు. ముందు నంద సామ్రాజ్యం ఉందనీ చెప్పలేదు. బిందుసారుడు, ఇతని కొడుకనీ చెప్పలేదు.


కనుక ఇతడు గుప్త సామ్రాజ్యపతియైన చంద్రగుప్తుడని ఎందుకు చెప్పకూడదు? గుప్త సామ్రాజ్యంలో ఇద్దరు చంద్రగుప్తులున్నారు. అందొకడు కాకూడదా? గుప్తులు పాటలీ పుత్రాన్ని పాలించారు కదా!


మన పురాణాలను, రాజ తరంగిణిని, నేపాలు రాజుల కథలను పరిశీలిస్తే అతడు మౌర్య చంద్ర గుప్తుడు కాదని తెలుస్తుంది. మనవాళ్ళ లెక్కల ప్రకారం క్రీ.పూ. 1500లో మౌర్య చంద్రగుప్తుడున్నాడు. ఇట్లా చరిత్ర 1200 సంవత్సరాలు వెనుకకు వెడుతుంది. అట్లాగే శంకరుల కాలమూ 1300 సంవత్సరాలు వెనుకకు వెడుతుంది.


విష్ణు పురాణంలో పరీక్షిత్తు పాలించిన వెనుక మహాపద్మనందుడు పాలించినట్లుంది. తరువాత చంద్ర గుప్తు మౌర్యుడు వస్తాడు. నందరాజ్యం క్రీ.పూ. 1600 సంవత్సరంలో, కాని చంద్రగుప్త మౌర్యుడు, క్రీ.పూ. 400 అని చరిత్రకారులు నిర్ధారణకు వచ్చారు. రెండవ చంద్రగుప్తుడు క్రీ.త. 5వ శతాబ్దమని అన్నారు. దానితో తేడా వచ్చింది.


వారితో వివాదపడనవసరం లేదు. లోతుగా పరిశోధన జరగాలంటున్నా పురాణాలను, మిగిలిన చారిత్రక గ్రంథాలను విజయవాడకు చెందిన శ్రీ కోట వెంకటాచలంగారు పరిశీలించి మెగస్థనీస్ వచ్చింది గుప్తరాజుల కాలంలోనే అని, మౌర్య చంద్రగుప్తుని కాలంలో కాదని నిర్ధారించారు. (వివరాలకు వారి కలిశక విజ్ఞానం చూడండి) వారు తరువాత అద్వైత సన్న్యాసి అయ్యారు. అట్లాగే కె.జి. నటేశ అయ్యర్ కూడా వేంకటాచలంగారి మార్గంలోనే పరిశోధించారు. వాటిని చూడండి.


No comments:

Post a Comment