Thursday, 4 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 152 వ భాగం



వారు స్థాపించిన మఠమే వారి భౌతికరూపం. రామానుజులు మఠాలను స్థాపించలేదు. అట్లాగే ఏ వైష్ణవ ఆచార్యుడూ స్థాపించలేదు. కాని వారి మూర్తులు విష్ణ్వాలయాలలో ఉంటాయి. కాబట్టి మఠాలలో శంకర జయంతి ఘనంగా జరుపుకోవాలి.


కామాక్షి ఆలయంలో శంకర జయంతి 


కామాక్షి ఆలయానికి, మఠానికి శంకరుల జీవితానికి దగ్గర సంబంధం ఉండడం వల్ల ఆలయంలో వీరి మూర్తి గంభీరంగా ఉంటుంది. వీరికి ఇక్కడ మూలవిగ్రహము, ఉత్సవమూర్తులతో కూడిన ప్రత్యేక సన్నిధియుంది.


జయంతిని గర్భోత్సవంగా జన్మోత్సవంగా జరుపుతారు. జయంతి ముందు పదిరోజులు నుండి గర్భోత్సవం ఉంటుంది. జయంతితో ముగుస్తుంది. గర్భంలో ప్రాణి నవమాసాలూ ఉంటాడు. ఇక జయంతి నుండి పదిరోజుల వరకూ జరుపబడేది జన్మోత్సవం. పుణ్యాహవాచనంతో ముగుస్తుంది. గర్భోత్సవం, కృష్ణపక్షంలో ఆరంభింపబడి వైశాఖ శుద్ధ పంచమితో ముగుస్తుంది.


కామాక్షి ఆలయంలో జన్మోత్సవమే ఉంటుంది. పూర్ణిమతో అంతం. దీనిని దేవాలయమే నిర్వహిస్తుంది. ఇతరుల విరాళాలతో కాదు.


No comments:

Post a Comment