కేవలం దివ్యశక్తి ప్రదర్శనమైతే వారెట్లా సంఘంలో కలిసి మెలిసి యుండగలరు? అనగా కొంత దూరంగా ఉంటూ దగ్గరగా ఉంటారన్నమాట.
ప్రపంచంలో పరిస్థితులు క్షీణిస్తున్నప్పుడు శంకర, జ్ఞాన సంబంధులు వాటిని వీలైనంత వేగంతో సరిజేద్దామనుకున్నారు. శంకరులు తమ 32 ఏళ్ళ జీవిత కాలంలోనే యావద్దేశంలో పునర్జీవనం తీసుకొని వస్తే జ్ఞాన సంబంధులు బ్రతికిన 16 సంవత్సరాలలోనే తమిళ దేశంలో అలౌకిక కృత్యాలు చేసారు. ఇది బాల్యంనుంచి వారికి ఉన్న మేధస్సు, విషయ జ్ఞానం వల్ల జరిగింది.
ఇట్లా ఉపనయనం, గురుకుల వాసం జరిగి ఎనిమిదవయేటనే సమస్త శాస్త్రాలను శంకరులు కరతలామలకం చేసుకున్నారు. ఇదంతా లోక మర్యాద కోసం వారు తలుచుకుంటే ఇంకా ముందే చదువు ముగింపగలరు.
అట్టి అలౌకిక వ్యక్తియే రాజచూడామణి దీక్షితుడు. ఇతడు అప్పయ్య దీక్షితుల బావమఱది. ఉపనయనానికి ముందే అన్నీ వీరికి వశమయ్యాయట. కమలినీ కలహంసం అనే వీరు వ్రాసిన నాటకంలో బ్రహ్మగారి భార్యయైన గాయత్రి, నన్ను సమీపించకముందే, అతని మరొక భార్యయైన సరస్వతి, నా దగ్గరకు వచ్చిందని స్పష్టంగా వ్రాసుకొన్నాడు.
కనీస కాలంలో ఉపనయనం మీ బిడ్డలకు చేయలేకపోతే శంకరుల చరిత్ర చదివి ఏం లాభం?
శంకరులు అనేక శాస్త్రాలను చదివినట్లు వీరి చరిత్రలో ఉంది. "అన్వీక్ష క్యైక్లి" శ్లోకంలో పరిపాలనకు సంబంధించిన 'అన్వీక్షకి' శాస్త్రం చూడడంతోనే వశమైందని, సాంఖ్య శాస్త్రాన్ని మీమాంసను అవలోకనం చేసారని; "పేతం పాతం జలాంఛః" అనగా పతంజలి యోగశాస్త్రాన్ని త్రాగారని; ఆంజనేయుడు సముద్రాన్ని దాటినట్లు కుమారిలుని శాస్త్రాన్ని అనగా మీమాంసను దాటారని వ్రాయబడింది.
ఆన్వీక్షక్యైక్షి, తంత్రే పరిచితి రతులా కాపిలే కాపిలేయే
పీతం పాతం జలాంభః పరమపి విదితం భాట్ట ఘట్టార్ధ తత్త్వం
యత్ సౌఖ్యం సదస్యాంతర్భవత్ అమలాద్వైత విద్యా సుఖేజిఽస్మిన్
No comments:
Post a Comment