కనకధారాస్తవం
ఒక ద్వాదశినాడు 'భవతి భిక్షాందేహి' అని ఒక ఇంటి ముంగిట శంకరులు నిలబడ్డారు. ఆ ఇంటి యజమాని దరిద్రుడని తెలిసి వారిని అనుగ్రహించడానికి భిక్షనడిగి అనుగ్రహ భిక్ష పెట్టారన్నమాట. శంకరులు వెళ్ళినపుడు ఇంటి యజమాని లేదు. కాని గృహిణి యుంది. బ్రహ్మచారికి ఈయడానికి తనదగ్గర ఏమీలేదు. కాని బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందేవానికి ఎంతో కొంత ఇస్తే పుణ్యం దక్కుతుందని భావించింది. ఇంటిని గాలించింది. ఒక ఎండిపోయిన ఉసిరికాయ కనబడింది. ద్వాదశినాడు, ఉసరిక తినాలి కనుక ఆ యజమాని దాచి యుంటాడు.
దానినే భిక్షా పాత్రలో వేసింది. వెంటనే శంకరులు కనకధారాస్తవం చేసారు. భాగ్యంతో వారిని అనుగ్రహించుమమ్మా అని అమ్మవారిని ప్రార్ధించారు. ఇదే వారి మొదటి స్తోత్రం. అపుడు అశరీరవాణి 'ఇది వీరి పూర్వ జన్మ పాపఫలం' అని చెప్పింది.
అమ్మా! వీరెన్ని దుష్కర్మలు చేసినా వీరిపట్ల దయ చూపించుమమ్మా అని ఎట్లా ప్రార్ధించారో చూడండి.
నీ దృష్టియనే మేఘం, దయావాయువుచే ప్రేరేపించబడినదై ఎంతోకాలంగా ఉన్న దుష్కర్మలనే తాపాన్ని తొలగించి, దరిద్ర శిశువుననే చాతక పక్షిపై ధనమనే వర్షాన్ని కురిపింపుమమ్మా అన్నారు. (కేరళలో వైశాఖమాసంలో కూడా నైఋతి పవనాలు వీచి చల్లని మేఘాలను సృష్టిస్తాయి.
No comments:
Post a Comment