Wednesday 10 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 156 వ భాగం



శ్రీశైలం - అర్జున క్షేత్రం


పరమేశ్వరునకు, మల్లెకూ సంబంధం ఉంది. మల్లె మాదిరిగా ఇతడు తెలుపు ఈయనకు మల్లికార్జునుడనే పేరు ఉంది. ఇక శంకరులకు శ్రీశైలంతో సంబంధం ఉంది. వీరి శివానందలహరిలో 50,51 శ్లోకాలలో వీరు వ్రాసిన యోగతారావళిలోనూ శ్రీశైల మల్లికార్జున ప్రస్తావన వస్తుంది. ఉంది. లతలు పెనవేసుకొని యుండగా, నా చెవులలో పక్షులు గూళ్ళు కట్టుకొని యుండగా కదలని, మెదలని స్థితిలో శ్రీశైల గుహలలో ఎప్పుడుంటానో కదా అని అన్నారు.


మల్లె తీగ, మద్ది చెట్టును చుట్టుకొని యుండడం వల్ల మల్లికార్జునమైంది. అంబిక తీగయై, స్థాణువైన శివుణ్ణి చుట్టుకొని యుంటుంది. ఆమె మనలో జ్ఞానశక్తియే. అది ఆత్మతత్త్వమైన శివుణ్ణి, చుట్టి యుండాలి. మద్ది తెలుపు, శివుడూ తెలుపే.


అర్జున వృక్షం శివం కాగా, అమ్మవారు మల్లెతీగ. మరొకవిధంగా చెప్పవచ్చు. మల్లెతీగలో నున్న పువ్వు, శివుడు కాగా, మకరందం ఆస్వాదించే తుమ్మెదయే అమ్మవారు. శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబిక. శివానందలహరిలో ఆచార్యులు:


సంధ్యారంభవిజృంభితం శ్రుతి శిరః స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మసకృత్ సద్వాసనా శోభితం


భోగీంంద్రా భరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేపే శ్రీ గిరిమల్లి కార్జున మహాలింగం శివాఽఽలింగితం 


ఈ శ్లోకానికి రెండర్థాలున్నాయి. ఒకటి మల్లెకు, రెండవది శివునకు చెందినదిగా ఉంటుంది.


No comments:

Post a Comment