Monday, 1 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 149 వ భాగం



కేరళ, ఆయుర్వేదానికి ప్రసిద్ధి. నేయి ఎంత ప్రాతదైతే దీని గుణం అంత ఎక్కువగా ఉంటుందని, వైద్యులు దానిని తీసుకొని వెడుతూ ఉంటారు. మండలం (40) రోజులు దీక్షతో ఈ పుణ్యదంపతులు సంతానానికై స్వామి సన్నిధిలోనే ఉన్నారు.


వర ప్రదానం


స్వామి ప్రత్యక్షమయ్యాడు. దీర్ఘాయుర్దాయం కలిగిన వందమంది మూర్ఖులు కావాలా? అల్పాయుష్కుడూ, సర్వజ్ఞుడూ అయిన ఒక్క పుత్రుడు కావాలా అని అడిగాడు.


శివగురువు భార్య నడుగుతానన్నాడు. తనకూ అట్టి కల వచ్చిందని ఆర్యాంబ చెప్పింది. స్వామిని మీ ఇష్టం వచ్చినట్లు చేయమన్నారు. నేనే అవతరిస్తాను. అయితే ఎనిమిది సంవత్సరాలే ఈ భూమిపై ఉంటా అన్నారు స్వామి. ఆమె గర్భంలో ఒక దివ్య తేజస్సు అవతరించింది.


జయంతి గొప్పదనం


నందన నామ సంవత్సరంలో వైశాఖ మాసంలో శుద్ధ పంచమినాడు, అభిజిల్లగ్నంలో (మధ్యాహ్నం) ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో, ఉండి అర్ధా నక్షత్రం ఉండగా శంకరులవతరించారు. కొందరు అవతరించినది పునర్వసువని అంటారు. ఆ పంచమినాడొకప్పుడు ఆరుద్ర వస్తుంది. ఒక్కొక్కప్పుడు పునర్వసూ ఉంటుంది.


No comments:

Post a Comment