Thursday, 12 January 2023

శ్రీదత్త పురాణము (17)



వేద ధర్ముడు చెప్పిన దత్త చరిత్ర


దీపకా నీ సంస్కారం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. దత్త చరిత్రము వినాలని కోరిక కలగడం గొప్ప విశేషం తప్పకుండా చెప్తాను. ఈ రూపంగా ఆ దత్తదేవున్ని స్మరించుకొనే భాగ్యం నాకు కల్గించావు. ఈ సద్గురు దేవుని యొక్క కథ అత్యద్భుతం. చెప్పినవారు, విన్నవారు ధన్యులవుతారు. సర్వపాపాలు నశిస్తాయి. సర్వమంగళాలు లభిస్తాయి. కానీ ఆయన లీలలు అన్నీ చెప్పడం ఎవ్వరి తరమూ కాదు, ఆ పరమాత్మను ధ్యానించి ఆయన అనుగ్రహించిన మేరకు రూపాలు, నామాలు, మహిమలు, భక్తుల గాథలు, అన్నీ చెప్తాను ముందుగా అష్టోత్తర శతనామావళితో దత్తాత్రేయుణ్ని మన మనోమందిరములలో పూజిద్దాం. నమస్కార ప్రియుడు స్వామి, స్మరణ మాత్ర సంతుష్టుడు స్వామి. ఓం శ్రీం హ్రీం ద్రాం బీజంతో చివరిగా దత్త నామాన్ని ఉచ్చరించి నమః అని అంటే చాలు. స్వామి సంబరపడి కరుణామృత వృష్టి కురిపిస్తాడు.


ఓం శ్రీం హ్రీం దత్తాయనమః, ఓం దేవదత్తాయనమః, ఓం బ్రహ్మదత్తాయనమః, ఓం విష్ణుదత్తాయనమః, ఓం శివదత్తాయనమః, ఓం అత్రి దత్తాయనమః, ఓం ఆత్రేయాయనమః, ఓం అత్రివరదాయనమః, ఓం అనసూయాయనమః, ఓం అనసూయ సూనవేనమః, ఓం అవధూతాయనమః, ఓం ధర్మాయనమః, ఓం ధర్మపరాయణాయనమః, ఓం ధర్మపతయేనమః, ఓం సిద్ధాయనమః, ఓం సిద్ధిదాయననుః, ఓం సిద్ధి పతయేనమః, ఓం సిద్ధిసేవితాయనమః, ఓం గురవేనమః, ఓం గురుగమ్యాయనమః, ఓం గురోర్గురుతరాయనమః, ఓం గరిష్టాయనమః, ఓం వరిష్ఠాయనమః, ఓం మహిష్టాయనమః, ఓం మహాత్మనేనమః (25), ఓం యోగాయనమః, ఓం యోగపతయేననుః, ఓం యోగీశాయనమః, ఓం యోగాధీశాయనమః, ఓం యోగపరాయణాయననుః, ఓం యోగిధ్యేయాంధ్రి పంకజాయనమః, ఓం దిగంబరాయనమః, ఓం దివ్యాంబరాయనమః, ఓం పీతాంబరాయ నమః, ఓం శ్వేతాంబరాయ నమః, ఓం చిత్రాంబరాయనమః, ఓం బాలాయనమః, ఓం బాలవీర్యాయనముః, ఓం కుమారాయనమః, ఓం కిశోరాయనమః, ఓం కందర్ప మోహనాయనమః, ఓం అర్ధాంగలింగితాంగనాయనమః, ఓం సురాగాయనమః, ఓం విరాగాయనమః, ఓం వీతరాగాయనమః, ఓం అమృతవర్షిణేనమః, ఓం ఉగ్రాయనమః, ఓం అనుగ్రహరూపాయనమః (50), ఓం స్థవిరాయనమః, ఓం స్థవీయసేనమః, ఓం ఊర్ధ్వరేతసేనమః, ఓం ఏకవక్ర్తాయనమః, ఓం అనేక వక్ర్తాయనముః, ఓం ద్వినేత్రాయనమః, ఓం త్రినేత్రాయనమః, ఓం ద్విభుజాయనమః, ఓం షడ్భుజాయనమః, ఓం అక్షమాలినేనమః, ఓం శంఖినేనమః, ఓం గదినేనమః, ఓం మునయే నమః, ఓం మాలినే నమః, ఓం విరూపాయ నమః, ఓం స్వరూపాయ నమః, ఓం సహస్రశిరసేననుః, ఓం సహస్రాక్షాయనమః ఓం సహస్రబాహవేనమః (75), ఓం సహస్రాయుధాయనమః, ఓం సహస్రపాదాయనమః, ఓం సహస్ర పద్మార్చితాయనమః, ఓం పద్మపాదాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం పద్మమాలినే నమః, ఓం పద్మగర్భారుణాక్షాయనమః, ఓం పద్మకింజల్క వర్చసేనమః, ఓం జ్ఞానినేనమః ఓం జ్ఞాన గమ్యాయనమః, ఓం ధ్యాననిష్టాయనమః, ఓం ధ్యానస్థిమితమూర్తయేనమః, ఓం ధూళిధూసరితాంగాయనమః, ఓం చందనలిప్తమూర్తయేనమః, ఓం భస్మోద్ధూళితదేహాయనమః, ఓం దివ్యగంధానులేపినేనమః, ఓం ప్రసన్నాయనమః, ఓం ప్రమత్తాయనమః, ఓం ప్రకృష్టార్ధ ప్రదాయనమః, ఓం వరీయసేనమః, ఓం బ్రహ్మణేనమః, (100), ఓం బ్రహ్మరూపాయనమః, ఓం విష్ణవేనమః, ఓం విశ్వరూపిణే నమః, ఓం శంకరాయనమః, ఓం ఆత్మనేనమః, ఓం అంతరాత్మనేనమః ఓం పరమాత్మనేనమః (108) నాయనా దీపకా దత్త దయవల్ల నా దివ్య దృష్టికి గోచరించిన అష్టోత్తర శతనామావళి ఇది. స్వామి అనంతనామధేయుడు. అనంతరూపములు కలిగినవాడు. ఈ శతనామావళిని భక్తి శ్రద్ధలతో మూడు కాలాలలో జపించేవాడికి అష్ట అయిశ్వర్యములు లభిస్తాయి. ఆది వ్యాధులు తొలగుతాయి. కన్యలకు తగిన వరుడు లభిస్తాడు. ఇది సకల సిద్ధిప్రదం.


No comments:

Post a Comment