Friday 27 January 2023

శ్రీదత్త పురాణము (32)


 శ్రీదత్త పురాణము


ద్వితీయభాగం


సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. శౌనకాది మునులారా బ్రహ్మ కలిపురుషుడుకి చెప్తున్న దీపక వేదధర్ముల సంభాషణ ఇలా జరిగింది. అంతా కూలంకషంగా చెప్తాను ఆలకించండి.


వేదధర్ముడు చెప్పిన యదు - అవధూత సంభాషణని విన్న దీపకుడు శ్రద్ధగా విని పులకరించిపోయి, ఆనందంతో గురూత్తమా! నీ పాద పద్మాలను సేవించుకొనే భాగ్యం నాకు దొరికింది. నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లి తండ్రులు ధన్యులు, ప్రహ్లాద - అజగర సంభాషణ - యదు - అవధూత సంభాషణలు రెండుకి రెండు అత్యంత మనోహరాలు నిగూఢార్ధ ప్రభోధాలు. అయినా తనివి తీరలేదు. ఇంకా దత్త మహిమల్ని వినాలి తెలుసుకోవాలి అనే కుతూహలం నా మనస్సును తొందరపెడుతున్నది. దయచేసి మిగతా దత్త కధలు కూడా చెప్పి నన్ను తరింపజెయ్యండి నా జన్మ చరితార్ధం చేసుకొంటాను. దప్పికతో ఉన్నవాడు మధుర పానీయాలు ఆశించినట్లు నేను దత్త కధామృతాన్ని యాచిస్తున్నాను అనుగ్రహించు అన్నాడు.


నాయనా దీపకా ఈ దత్త కధల పట్ల నీకు ఇంత ప్రీతి కలుగడం నిజంగా నీ అదృష్టం. జనన మరణాలతో సంబంధం లేని ముక్తి నీకు లభించును. దత్త కధలలో అద్భుతమైన సుమతి వృత్తాంతంవుంది చెబుతాను విను. 


No comments:

Post a Comment