Thursday 19 January 2023

శ్రీదత్త పురాణము (24)



అప్పుడు అవధూత ఇలా చెప్తున్నాడు.


యదుమహారాజా నాకు ఇరవై నాలుగు మంది గురువులు. ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కోణంలో పొందాను. జీవన్ముక్తుడవై సంచరించుచున్నాను. పంచభూతాలు, సూర్యచంద్రులు, అజగర కపోతములు, సముద్రపతంగాలుగా, మధుకరగజాలు, మధుహారి హరిణములు, మినపింగళలు, కురర బాకులు, కన్యకాశరకారులు, పర్పకీటక ఊర్ణనాభాలు - ఇవీ నా ఇరవైనాలుగు గురువులు


పృధివీవాయురాకాశమాపోః గ్నిశ్చంద్రమారవిః | 

కపోతోంజగరః సింధుః పతంగో మధుకృత్ గజః ||

మధుహా హరిగోమినః పింగళు కురరోకార్చకః |

కుమారీ శరకృత్ సర్పడిన్దనాభిః సుపేశకృత్ ||


భూమి : మానవులు కాళ్ళతో త్రొక్కినా గునపములు తీసికొని త్రవ్వినా భూమి ఓర్చుకుంటుంది. అంతేకాక వారికి కావలసిన ఆహారం పండించి ఇచ్చి ఉపకారం చేస్తుంది. సహనాన్ని భూమి ద్వారా గ్రహించాను. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం భూమి నుండి నేర్చుకున్నాను.


వాయువు : అలాగే మన శరీరంలో వుండేది ప్రాణవాయువు. మనం తినే ఆహారాన్ని గ్రహిస్తుంది కాని విషయవాంఛలకు అతీతంగా వుంటుంది. ఉత్తమజ్ఞాని కూడా ఇలావుండాలి. జ్ఞానానికి దేహం, దేహమునకు ప్రాణం, ప్రాణమునకు ఆహారం అత్యవసరం. ఇక శరీరమునకు వెలుపల సంచరించే గాలి శీతోష్ణ దుఃఖములను సమముగా చూస్తుంది. రకరకాల దుర్గంధాలను, సుగంధాలను సమంగా గ్రహిస్తుంది. అయినా గంధ గుణం వాయువుకు లేదు. యోగి అయినవాడు ఈ రెండు గుణాలను వాయువు నుండి నేర్చుకోవాలి. పంచభూతాత్మక శరీరంలోకి ప్రవేశించినా ఆ గుణాలు అంటకుండా చూసుకోవాలి. దీన్నే నిర్దేపత్వం అంటారు. దీన్ని గ్రహించాను వాయువు నుండి.


ఆకాశం : ఆకాశం నుండి సర్వవ్యాపకత్వము, సర్వ బ్రహ్మతత్వం, అభంగత్వము అసంగత్వము గ్రహించాను.


జలం : జలం నుండి నిర్మలత్వం, స్నిగ్ధత్వము, మధురత్వం, పావనత్వం నేర్చుకున్నాను. ఇవి గ్రహించిన యోగులు తమని తల్చుకున్న వార్ని పావనం చెయ్యగలుగుతారు.


No comments:

Post a Comment